Cine Actor Prakash Raj Tweet to Dy CM Pawan Kalyan: లడ్డూ కల్తీ వ్యవహారమై ఇటీవల నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ గురించి పవన్ కల్యాణ్ విజయవాడలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. ఆ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ స్పందించి రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, ఇండియాకు వచ్చాక పవన్ కల్యాణ్ ప్రతీ ప్రశ్నకు సమాధానమిస్తానని ప్రకాశ్ రాజ్ అన్నారు. ‘పవన్ కల్యాణ్ మీ ప్రెస్‌మీట్ ఇప్పుడే చూశానని నేను చెప్పిన దాన్ని మీరు అపార్థం చేసుకున్నారని ఆయన అన్నారు. ప్రస్తుతం నేను విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నానని ఈ నెల 30వ తేది తర్వాత భారత్‌కు వచ్చి మీ ప్రశ్నలకు సమాధానం చెప్తానని తెలిపారు. ఈలోగా మీకు వీలుంటే నా ట్వీట్‌ను మరో సారి చదవి. అర్థం చేసుకోండని ప్రకాశ్ రాజ్ అన్నారు.
ఇదీ జరిగింది: తిరుమల లడ్డూ కల్తీపై వస్తున్న ఆరోపణలపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. రాజకీయ నాయకులు, భక్తులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ప్రకాశ్ రాజ్ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ సామాజిక మాధ్యమైన ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌లో ‘మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఈ ఘటన జరిగిందని విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. అంతేగాని మీరెందుకు అనవసర భయాలు కల్పించి ఈ విషయాన్ని జాతీయస్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే మన దేశంలో ఉన్న మతపరమైన ఉద్రిక్తలు చాలు ఇంక కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.
Dear @PawanKalyan garu..i saw your press meet.. what i have said and what you have misinterpreted is surprising.. im shooting abroad. Will come back to reply your questions.. meanwhile i would appreciate if you can go through my tweet earlier and understand #justasking pic.twitter.com/zP3Z5EfqDa
— Prakash Raj (@prakashraaj) September 24, 2024
తెలుసుకుని మాట్లాడండి: దీనిపై పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన ఆయన విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిని సందర్శించారు. ఈ క్రమంలో పనవన్ ఆలయ మెట్లను శుభ్రం చేసి, పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. ఆ తర్వాత మీడియాతో పవన్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సున్నితాంశాలపై ప్రకాశ్ రాజ్ తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. ఆయనతో పాటు అందరికీ చెబుతున్నానని విమర్శలకు ముందు ఏం జరిగిందో తెలుసుకోండని హితవు పలికారు. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని’ పవన్ వ్యాఖ్యానించారు.
సనాతన ధర్మం జోలికొస్తే ఊరుకునేది లేదు : పవన్ కల్యాణ్ - Pawan Kalyan Visits Indrakeeladri
కల్తీ నెయ్యిని చిటికెలో కనిపెట్టేయొచ్చు - ఈ చిట్కాను పాటిస్తే సరి! - Ghee Purity Test At Home