ETV Bharat / state

సవాల్‌గా మారిన బోట్ల వెలికితీత - బయటకు తెచ్చేందుకు మరో ప్లాన్ - BOATS REMOVAL AT PRAKASAM BARRAGE - BOATS REMOVAL AT PRAKASAM BARRAGE

PRAKASAM BARRAGE BOATS REMOVAL PROCESS: ప్రకాశం బ్యారేజ్‌ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ క్లిష్టంగా మారింది. బోట్లను ఒడ్డుకు తెచ్చేందుకు ఇంజినీర్లు, అధికారులు, బోట్లు వెలికి తీసే నిపుణులు 6 రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. బోట్లను బయటకు తెచ్చేందుకు మరో ప్లాన్ అమలుచేసే యోచనలో ఉన్నారు. రెండు బోట్లను గడ్డర్లతో కలిపి చిక్కుకున్న బోట్లను లాగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

PRAKASAM BARRAGE BOATS
PRAKASAM BARRAGE BOATS (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 15, 2024, 9:04 PM IST

PRAKASAM BARRAGE BOATS REMOVAL PROCESS: ప్రకాశం బ్యారేజీ వద్ద అదికారులు, నిపుణులను బోట్లు ముప్పతిప్పలు పెడుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ కష్టంగా మారింది. బోట్లను ఒడ్డుకు తీసేందుకు ఆరు రోజులుగా తీవ్రంగా శ్రమిస్తోన్నా ఫలితం కనపడటం లేదు. అబ్బులు బృందం ఒక పడవను కూడా బయటకు తీసుకుని రాలేదు. దీంతో మరో ప్రణాళికను బెకెం సంస్థ అమలు చేయాలని నిర్ణయించింది. రెండు భారీ పడవలను గడ్డర్లతో కలిపి ఇంజినీర్లు అనుసంధానిస్తున్నారు. ఆ పడవల్లో ఇసుక, నీరు నింపి చిక్కుకున్న పడవలను వెలుపలకు తీసుకు వచ్చే ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించారు.

ప్రకాశం బ్యారేజీ వద్ద అడ్డుపడి చిక్కుకుపోయిన పడవల తొలగింపు ప్రక్రియ ఆరోరోజూ కొనసాగుతోంది. పడవలను ఒడ్డుకు తెచ్చేందుకు ఇంజినీర్లు, అధికారులు, బోట్లు వెలికి తీసే నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇసుకలో ఇరుక్కోవడంతో బోట్ల వెలికితీత ప్రక్రియ సంక్లిష్టంగా మారింది.

10 అడుగులు కదిలి బోల్తా పడింది - కొనసాగుతున్న బోట్ల వెలికితీత ప్రక్రియ - Boat Removal process on third day

ఈనెల 1న భారీ ప్రవాహానికి ఎగువ నుంచి వేగంగా కొట్టుకు వచ్చిన 5 బోట్లు బ్యారేజీ గేట్లను బలంగా ఢీకొట్టాయి. 67, 69, 70 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. ప్రవాహంలో ఒక పడవ దిగువకు కొట్టుకు పోగా, 3 భారీ పడవలు, ఒక మోస్తరు పడవ కలిపి గేట్లవద్దే చిక్కుకున్నాయి. ఈ పడవలకు ఒకదానితో మరొకటి కట్టి వదలడంతో లంకె పడ్డాయి. దీంతో బ్యారేజీ గేట్లకు అడ్డుపడి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. అడ్డుపడిన భారీ పడవలను తొలగించేందుకు కాకినాడకు చెందిన అబ్బులు బృందం శుక్రవారం నుంచి తీవ్రంగా శ్రమిస్తోంది.

భారీ పడవకు ఇనుప రోప్ కట్టి ప్రొక్లెయిన్‌తో బయటకు లాగేందుకు ప్రయత్నించారు. ఒడ్డుకు చేర్చేందుకు మూడురోజులుగా ప్రయత్నిస్తున్నా కేవలం 20 మీటర్ల మేర మాత్రమే బోటు వెనక్కి కదలింది. ఒక్కోటి 40 టన్నుల పైగా బరువుండి ఒకదానితో మరొకటి లంకెపడటంతో 3 భారీ పడవలు కదలడం లేదు. ఒక పడవను బయటకు తీసే క్రమంలో ఇసుకలో చిక్కుకుపోవడంతో ఆటంకం ఏర్పడింది.

నదిలో ప్రవాహం పెరగుతుండటంతో వాటి తొలగింపు సంక్లిష్టంగా మారింది. వందటన్నుల బరువు లాగే ప్రొక్లెయిన్‌కు రోప్‌లు కట్టి ఒడ్డుకు చేర్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బ్యారేజీ ఎగువ వైపునుంచి భారీ పడవలను అధికారులు తెప్పిస్తున్నారు. చిక్కుకున్న పడవలను వాటికి కట్టి ఒడ్డుకు తెచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్లు తొలగింపు ప్రక్రియ వేగవంతం - రంగంలోకి మరో టీం - BOATS REMOVAL AT PRAKASAM BARRAGE

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.