ETV Bharat / state

కల్కి సినిమాకు, ఇసుకలో నిక్షిప్తమైన ఈ ఆలయానికి ఏంటి సంబంధం? - KALKI MOVIE TEMPLE - KALKI MOVIE TEMPLE

Kalki 2898 AD Movie Mysterious Temple : కల్కి 2898 ఏడీ మూవీ థియేటర్ల వద్ద సందడి చేస్తోంది. మూవీ చూసిన ప్రతి ఒక్కరూ అందులో ఉన్న పురాతన ఆలయం గురించే చర్చించుకుంటున్నారు. ఆ ఆలయం ఎక్కడ ఉందో అని తెగ వెతికేస్తున్నారు. వారందరి కోసం ఈటీవీ భారత్ దానికి సంబంధించిన విషయాలు మీ ముందుకు తీసుకొచ్చింది.

Kalki 2898 AD Movie Old Temple
Kalki 2898 AD Movie Mysterious Temple (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 28, 2024, 4:35 PM IST

కల్కి సినిమాలో చూపించిన ఓల్డ్ టెంపుల్ ఇదే! - ఆలయ విశేషాలేమిటో తెలుసా? (ETV Bharat)

Kalki 2898 AD Movie Old Temple : రెబల్ స్టార్ ప్రభాస్​ నటించిన సైన్స్ ఫిక్షన్, మైథలాజికల్ కల్కి 2898 ఏడీ మూవీ థియేటర్లలో సంచలనం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. సినిమాలో ప్రభాస్​తో పాటు అమితాబ్‌ బచ్చన్‌, కమల్ హాసన్ అదరగొట్టారు. సినిమాలో, తొలుత రిలీజ్ చేసిన ట్రైలర్​లో ఎక్కువగా ఓ పురాతన ఆలయాన్ని చూపించారు. ఆ ఆలయంలోనే ఎన్నో ఏళ్ల పాటు అమితాబ్​ బచ్చన్ ఉన్నట్లు చూపించారు.

మూడో బిగ్గెస్ట్ ఓపెనర్​గా 'కల్కి' ఫస్ట్ డే కలెక్షన్స్​ - ఎన్ని కోట్లంటే?

ఈ చిత్రం థియేటర్లలో ప్రదర్శిస్తుండటంతో చిత్రం చూపించిన దేవాలయం ఎక్కడ ఉందో అని ప్రభాస్ అభిమానులు తెగ సెర్చ్ చేసేస్తున్నారు. దీంతో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ అభిమానుల కోసం ఈటీవీ భారత్ టీమ్ దీని గురించి తెలుసుకుంది. ఈటీవీ భారత్ చేసిన పరిశీలనలో ఈ పురాతమైన ఈశ్వరుని ఆలయం ఆంధ్రప్రదేశ్​లోనే ఉన్నట్లు తెలిసింది. నెల్లూరి జిల్లా పెరుమాళ్లపాడులోని నాగేశ్వర ఆలయమే అది అనే ప్రచారం జరుగుతోంది.

చారిత్రక నేపథ్యం.. నెల్లూరు జిల్లాలో పెన్నా నది తీరంలో ఇసుకలో ఈ నాగేశ్వర స్వామి ఆలయం నిక్షిప్తమై ఉంది. 2020లో చేజర్ల మండల పరిధిలోని పెరుమాళ్లపాడు గ్రామం వద్ద ఇసుక తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఈ చారిత్రాత్మక నాగేశ్వర స్వామి ఆలయం వెలుగులోకి వచ్చింది. ఈ ఆలయం అనేక దశాబ్దాలుగా ఇసుకలో నిక్షిప్తమై ఉన్నట్లు సమాచారం. అంతేకాదు జానపద కథల ప్రకారం ఈ ఆలయాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడని స్థానికులు చెబుతున్నారు.

ఈ ఆలయాన్ని 19వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించి ఉండవచ్చని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. పెన్నా నదిలో 1850 వరదల తర్వాత ఇసుకలో ఈ ఆలయం కూరుకుపోయింది. ఈ ఆలయం కింద వందల ఎకరాల మాన్యం ఉంది. అంతేకాదు పెన్నా నదికి వచ్చే వరదలు గ్రామాలను ముంచెత్తడంతో 200 ఏళ్ల క్రితం నుంచే ప్రజలు క్రమంగా నదికి దూరంగా తమ నివాసాలను మార్చుకున్నారు.

ఇసుక తవ్వకాల్లో బయటపడిన ఈ ఆలయం గురించి సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని తవ్వకాలను నిలిపివేశారు. ఇసుక తవ్వకాన్ని కొనసాగిస్తే ఆలయ నిర్మాణం దెబ్బతినే ప్రమాదం ఉందని వారిని అడ్డుకున్నారు. తర్వాత చారిత్రాత్మక నాగేశ్వర స్వామి ఆలయ పరిరక్షణ చేపట్టారు. ఆలయం బయటపడటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సందర్శించి పూజలు నిర్వహిస్తున్నారు.

'కల్కి' కలెక్షన్ రికార్డ్స్​పై నిర్మాత స్పప్న దత్​ ఇంట్రెస్టింగ్​ పోస్ట్​

'కల్కి' యాక్షన్ సీక్వెన్స్ వెనక ఉన్న రియల్ హీరో ఇతడే! - మేకింగ్ వీడియో చూశారా? - Kalki 2898 AD Making Video

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.