ETV Bharat / state

అదీ ప్రభాస్ మేనియా అంటే - డార్లింగ్ ఫ్యాన్స్​తో దద్దరిల్లుతున్న థియేటర్లు - PRABHAS FANS AT SANDHYA THEATER - PRABHAS FANS AT SANDHYA THEATER

Kalki Prabhas Fans Celebrations At Theatres : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం ప్రపంచ వ్యప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాను చూసేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ ప్రీమియర్, బెనిఫిట్ షోస్ టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్​లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్ వద్దకు భారీగా చేరుకున్నారు. ప్రభాస్ కటౌట్ ముందు స్టెప్పులేస్తూ డార్లింగ్ ఫ్యాన్స్ నానా హంగామా చేశారు.

Prabhas Fans Celebrations
Prabhas Fans Celebrations (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 27, 2024, 10:20 AM IST

Updated : Jun 27, 2024, 11:49 AM IST

Fans Celebrate 'Kalki 2898 AD' Release : హైదరాబాద్​లో కల్కి సినిమా విడుదల హడావుడి నెలకొంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా 70 ఎంఎం థియేటర్ వద్దకు ప్రముఖ సినీ హీరో ప్రభాస్ అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రభాస్ కటౌట్ ముందు అభిమానులు డ్యాన్సులు చేసి కోలాహలం చేశారు. హైదరాబాద్​లోని ప్రముఖ సినిమా థియేటర్లలో తెల్లవారుజామున ఉదయం 4.30 కు కల్కి సినిమా ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇప్పటికే పూర్తిగా మొదటి మూడు రోజుల టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ అయ్యాయి. కల్కి సినిమా టికెట్ల బ్లాక్ వ్యాపారం జోరుగా కొనసాగిందని ప్రభాస్ అభిమానులు అంటున్నారు. అయినా సరే బ్లాక్​లో భారీ ధరకు టికెట్లు కొని మరీ ఈ సినిమాను చూసేందుకు వెళ్లామని చెబుతున్నారు.

'కల్కి' ఓటీటీ డీటెయిల్స్​ ఇవే​ - డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే? - Kalki 2898 AD OTT Rights

సంధ్య థియేటర్ వద్ద ఫ్యాన్స్ హంగామా : క ఏ హీరో సినిమా అయినా ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్​లో అభిమానుల సందడి మాములుగా ఉండదు. అందులోనూ పాన్ ఇండియా స్టార్, అదేనండి మన రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటే మామూలుగా ఉంటుందా మరి. సినిమా విడుదలకు రెండు మూడు గంటల నుంచే, కొందరైతే ఏకంగా రాత్రి నుంచే థియేటర్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే సంధ్య థియేటర్ అభిమానులతో కిక్కిరిసిపోయింది. తమ అభిమాన హీరో సినిమా సంధ్య థియేటర్లో చూడటం ఆనవాయితీగా పెట్టుకున్న అభిమానులు, వేల సంఖ్యలో థియేటర్​కు వచ్చారు. థియేటర్​ మొత్తం రెబల్ స్టార్ ప్రభాస్ కటౌట్​లతో నింపారు నిర్వాహకులు. ప్రభాస్ చిత్రానికి భారీ గజమాలను వేశారు. పాలాభిషేకంతో తమ అభిమానాన్ని చాటుకున్నారు ఫ్యాన్స్. థియేటర్ వద్ద టికెట్ కొందామనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది.

'కల్కి' ట్విటర్ రివ్యూ - సినిమా టాక్ ఎలా ఉందంటే? - Kalki 2898 AD Movie Review

మరోవైపు బుకింగ్స్ ప్రారంభించిన క్షణాల్లో టికెట్లు మొత్తం అమ్ముడుపోయాయి. బెనిఫిట్ షోకు సైతం భారీగా ప్రభాస్ అభిమానులు రావడంతో థియేటర్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. థియేటర్ భయట ఎల్ఈడీ స్క్రీన్స్​తో ప్రభాస్ గత చిత్రాలకు సంబంధించిన ఇమేజ్​లను ప్రదర్శించారు. భారీ సంఖ్యలో వాహనాలు రావడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. చిత్రానికి భారీ సంఖ్యలో ప్రభాస్ అభిమానులు వస్తారని తెలిసిన పోలీసులు, అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు.

Kalki Prabhas Fans Celebrations
Kalki Prabhas Fans Celebrations (ETV Bharat)

ప్రభాస్ అభిమానులు హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ వద్ద సందడి చేశారు. సినిమా చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సినిమాలో ఉపయోగించిన బుజ్జి వాహనాన్ని చిత్రబృందం అక్కడ ప్రదర్శనకు ఉంచింది. బుజ్జితో ఫోటోలు తీసుకునేందుకు ఫ్యాన్స్ పోటీ పడ్డారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావండంతో ఐమాక్స్ వద్ద ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది.

'కల్కి' విజయ్​ దేవరకొండ, దుల్కర్​ ర్యాంపేజ్​ - ఈ హైలైట్​ సీన్స్​ చూశారా? - Kalki 2898 AD Movie

Last Updated : Jun 27, 2024, 11:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.