ETV Bharat / state

'కల్కి' విడుదలతో ప్రభాస్‌ అభిమానుల సందడి - కళకళలాడుతున్న థియేటర్లు - prabhas fans celebrations

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 27, 2024, 12:56 PM IST

Prabhas Fans Celebrations: కల్కి 2898 ఏడీ చిత్రం విడుదల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభాస్‌ అభిమానులు సందడి చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో భారీ ప్లెక్సీలు ఏర్పాటు చేసి కేకులు కోశారు. బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాల్లో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పాల్గొని అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేశారు. మరోవైపు 'కల్కి' చిత్రబృందానికి మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు.

Prabhas Fans Celebrations
Prabhas Fans Celebrations (ETV Bharat)

'కల్కి' విడుదలతో ప్రభాస్‌ అభిమానుల సందడి - కళకళలాడుతున్న థియేటర్లు (ETV Bharat)

Prabhas Fans Celebrations at Kalki Theatres: గత కొన్ని రోజులుగా పెద్ద సినిమాల విడుదల లేక వెలవెలబోయిన థియేటర్లు రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించిన కల్కి 2898 ఏడీ రాకతో కళకళలాడుతున్నాయి. అభిమాన హీరో చిత్రం విడుదల కావడంతో ప్రభాస్‌ అభిమానులు సందడి చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ప్రభాస్ కల్కి సినిమా విడుదల సందర్బంగా అభిమానులు సందడి చేశారు. ప్రభాస్ కల్కి భారీ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు.‌ కల్కి పేరుతో కేక్ ఏర్పాటు చేసి బాణసంచా కాల్చుతూ ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ప్రభాస్ అభిమానుల సంబరాల్లో ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేట్ కట్ చేసి అభిమానులకు తినిపించారు.

ఇప్పటివరకు దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్‌ సినిమా కల్కి అని రఘురామ కృష్ణరాజు కొనియాడారు. కల్కి - 2 ఉంటుందని అందులో కమల్ హాసన్ మెయిన్ విలన్ అని అన్నారు. ఆ సినిమా కల్కి -1 కంటే కూడా అత్యంత వైభవంగా ఉండబోతుందని అన్నారు. ఒక కొత్త ల్యాండ్ మార్క్ రికార్డును కల్కి సృష్టిస్తుందని, ఆ రికార్డును కల్కి-2 తో బద్దలు కొడతామని తెలిపారు.

ప్రేక్షకులతో కిటకిటలాడుతున్న థియేటర్లు: కర్నూలులో ప్రభాస్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. బాణసంచా కాలుస్తూ, డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. కల్కి చిత్రం విజయవంతం కావడంతో సినిమా థియేటర్ల వద్ద ప్రభాస్ అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. గత కొన్ని నెలలుగా పెద్ద సినిమాలు రిలీజ్ కాకపోవడంతో థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. నేడు కల్కి సినిమా విడుదల కావడంతో కర్నూలులోని సినిమా థియేటర్లన్నీ ప్రేక్షకులతో కిటకిటలాడుతున్నాయి. నాగ్‌ అశ్విన్‌ హాలివుడ్‌ తరహా కల్కి సినిమాను తీశారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Nara lokesh Tweet: కల్కి సినిమా బృందానికి మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. కల్కి మూవీకి అద్భుతమైన రివ్యూలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. చాలా సంతోషంగా ఉందని అన్నారు. భారతీయ సినిమాను కల్కి సినిమా బృందం పునర్నిర్మించిందని కొనియాడారు. ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపిక, నాగ్ అశ్వీన్​ను లోకేశ్ అభినందించారు. గ్లోబల్ లీగ్‌లోకి తెలుగు సినిమాని ముందుకు నడిపించిన అశ్వనీదత్, స్వప్న, ప్రియాంకలను లోకేశ్ ప్రత్యేకంగా ప్రశంసించారు.

'కల్కి 2898 ఏడీ' - ఇది మ‌రో ప్ర‌పంచానికి ఆరంభం - Kalki 2898 AD Movie Review

నార్త్ అమెరికాలో 'కల్కి' విధ్వంసం - RRR రికార్డ్ స్మాష్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.