ETV Bharat / state

రేపు ఉప్పల్ వేదికగా హైదరాబాద్, చెన్నై మ్యాచ్​ - స్టేడియానికి విద్యుత్ సరఫరా కట్​! - Power Supply Cut To Uppal Stadium

Power supply Cut to Uppal Stadium : విద్యుత్ బకాయిలు చెల్లించలేదనే కారణంతో ఉప్పల్ స్టేడియానికి విద్యుత్ సరఫరాను ఆ శాఖ అధికారులు నిలిపివేశారు. దీంతో పాటు ఉప్పల్ స్టేడియం నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. కాగా రేపు ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్- చెన్నైల మధ్య మ్యాచ్​ జరగనుంది.

Power supply Cut to Uppal Stadium
Power supply Cut to Uppal Stadium
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 4, 2024, 8:56 PM IST

Updated : Apr 4, 2024, 10:28 PM IST

Power Supply Cut To Uppal Stadium : విద్యుత్ బకాయిలు చెల్లించలేదనే కారణంగా ఉప్పల్ స్టేడియానికి విద్యుత్ శాఖ కరెంట్ సరఫరా నిలిపివేసింది. గతంలో విద్యుత్​ను అక్రమంగా వినియోగించుకున్నందుకు ఉప్పల్ స్టేడియం(Uppal Stadium) నిర్వాహకులపై విద్యుత్ చౌర్యం కేసు నమోదు చేసినట్లు హబ్సిగూడ ఎస్.ఈ రాముడు పేర్కొన్నారు. బిల్లులు చెల్లించకుండా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) రూ.1,63,94,521లు వాడుకున్నట్లు విద్యుత్ శాఖ ఆరోపించింది.

ఉపయోగించిన కరెంట్ బిల్లును 15 రోజుల్లోపు చెల్లించాలని ఫిబ్రవరి 20వ తేదీన నోటీసులు కూడా ఇచ్చామని హబ్సిగూడ ఎస్​.ఈ రాముడు తెలిపారు. అయినప్పటికీ ఉప్పల్ స్టేడియం నిర్వాహకులు స్పందించకపోవడంతో ఉప్పల్ స్టేడియానికి విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే ఇరుజట్ల క్రికెట్ క్రీడాకారులు ఐపీఎల్​ ప్రాక్టీస్ మ్యాచ్ కోసం కూడా చేశారు. ఈ మ్యాచ్​ ఎంతో కీలకమైన మ్యాచ్​ కావున విద్యుత్​ శాఖ అధికారులు కరెంటు సరఫరాను నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది.

ఉప్పల్‌ మ్యాచ్‌కు మీరు వెళ్తున్నారా? - కచ్చితంగా ఇవి పాటించాల్సిందే!

Sunrisers Hyderabad vs Chennai Super Kings : 2015లో కేసు నమోదు చేశామని 15 రోజుల క్రితమే స్టేడియం నిర్వాహకులకు నోటీసులు పంపినట్లుగా ఎస్​ఈ రాముడు వెల్లడించారు. బిల్లులు చెల్లించకపోవడం వల్లనే ఉప్పల్​ స్టేడియానికి విద్యుత్ నిలిపివేశామని ఆయన తెలిపారు. దీంతో జనరేటర్ల మీదనే ప్రాక్టీస్​ మ్యాచ్ నడిచింది. ఇదిలా ఉండగా రేపు ఉప్పల్​ స్టేడియం వేదికగా హైదరాబాద్​, చెన్నై మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్​ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

అస్సలు ఊహించలేదు - అలా చేసి ఉంటే బాగుండేది : హార్దిక్ పాండ్య

ఒక్క మ్యాచ్ 523 పరుగులు 38 సిక్స్‌లు - ఉప్పల్​లో సన్​రైజర్స్​ రికార్డుల సునామీ!

Last Updated : Apr 4, 2024, 10:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.