ETV Bharat / state

వర్షాకాలం ముంచుకొచ్చినా చలనం లేదా?- అస్తవ్యస్త డ్రైనేజీలతో నగరాల్లో అవస్థలు - DRAINAGE PROBLEM - DRAINAGE PROBLEM

Poor Drainage System Leads Many Problems : నగరాల్లో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. పల్లపు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరుతున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదు. గత ప్రభుత్వంలో ప్రారంభించిన వరద, మురుగునీటి కాలవల పనులను పక్కన పెట్టిన వైఎస్సార్సీపీ సర్కారు, ఐదేళ్లుగా కాలువల్లో కనీసం పూడిక తీసే ప్రయత్నం చేయలేదు.

poor_drainage_system_leads_many_problems
poor_drainage_system_leads_many_problems (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 25, 2024, 9:45 AM IST

Poor Drainage System Leads Many Problems : కాకినాడలో శుక్రవారం గంటన్నరపాటు కుండపోత పోసింది. ఏకధాటిగా కురిసిన వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కలెక్టరేట్ వద్ద రోడ్డుపై నీళ్లు చేరి ఆ ప్రాంతం చెరువును తలపించింది. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం నీట మునిగింది. సాంబమూర్తి నగర్, దుమ్ములపేట డైరీ ఫార్మ్ సెంటర్‌లో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. భారీ వర్షంతో చిరు వ్యాపారులు అవస్థలు పడ్డారు. భాస్కర్ నగర్, గోదారిగుంట, సురేష్ నగర్, పోస్టల్ కాలనీ, వెంకట్ నగర్‌ను వాన నీరు చుట్టుముట్టింది. డ్రైనేజీ వ్యవస్థను అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని స్థానికులు వాపోయారు. లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లి రహదారుల్ని ముంచేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. వానాకాలం తరుముకొస్తున్నా అధికారుల్లో చలనం లేదని మండిపడ్డారు.

Poor Drainage System In Kakinada : ఈ నెల ఏడో తేదీన కురిసిన కొద్దిపాటి వర్షానికే రాజమహేంద్రవరం అతలాకుతలమైంది. అప్పటికే మురుగు కాలవలు పూడికతో నిండిపోవడంతో వాన నీటికి తోడు మరుగునీరు రోడ్లపై పొంగి పొర్లింది. నగరవాసులు నరకయాతన పడ్డారు. ఇంత జరిగినా ఇప్పటికీ కాలవల్లో పూడికలు తొలగింపునకు నగరపాలక సంస్థ చర్యలు తీసుకోలేదు. మురుగు నీటిని గోదావరిలోకి పంపే నల్లా, ఆవ ఛానళ్లతోపాటు ప్రధాన కాలవలను శుభ్రం చేసేందుకు ఏటా వర్షాకాలం ముందు 10 లక్షల నుంచి 15 వరకు వెచ్చిస్తారు. ఈసారి అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

వర్షాకాలం ముంచుకొచ్చినా చలనం లేదా?- అస్తవ్యస్త డ్రైనేజీలతో నగరాల్లో అవస్థలు (ETV Bharat)

Drainage problem in Visakha due to rain water : విశాఖలో ముఖ్యమైన గెడ్డలు, కాలవల్లో భారీగా పేరుకుపోయిన వ్యర్థాలను వెంటనే తొలగించకపోతే వర్షాకాలంలో అనేక లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. గతేడాది తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా పాత నగరంలోని చాలా ప్రాంతాలు 6 గంటలకుపైగా ముంపులోనే మగ్గాయి. ఎర్రిగెడ్డ, ఎస్‌ఎల్‌ కెనాల్, గంగులగెడ్డలో టన్నుల కొద్దీ పేరుకుపోయిన వ్యర్థాలను. ఈ ఏడాది ఇప్పటికీ తొలగించలేదు. మల్కాపురం గెడ్డ, ఏకలవ్యకాలనీకి ఆనుకుని ఉన్న గెడ్డ, కేఆర్‌ఎం కాలనీ, మద్దిపాలెం పరిసరాల్లోని వరద నీటి కాలవల్లో ఇంకా వ్యర్థాలు తొలగించలేదు.

విజయవాడలో అస్తవ్యస్తంగా డ్రైనేజీ నిర్మాణం - ప్రజాధనం వృథాపై విమర్శలు - Improper drainage system

రహదారుల విస్తరణలో భాగంగా కడపలో పడగొట్టిన మురుగు కాలవలను తిరిగి ఇప్పటికీ పూర్తిగా నిర్మించలేదు. ఫలితంగా ఈ ఏడాది వర్షాకాలంలో కడప వాసులకు ముంపు కష్టాలు తప్పేలాలేవు. విస్తరణలో భాగంగా దెబ్బతిన్న కాలవలు పూడిపోయాయి.వర్షాలు కురిస్తే వ్యర్థాలు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. నగర పరిధిలో 23 ప్రాంతాల్లో వరద నీటి కాలవల నిర్మాణం కోసం గత ఏడాది 73 కోట్లతో టెండర్లు ఖరారు చేసినా ఇప్పటివరకు 3 ప్రాంతాల్లోనే పనులు ప్రారంభించారు. ఇవి కూడా నత్తనడకన సాగడంతో మురుగు నీరు ముందుకు సాగక ప్రజలు అవస్థలు పడుతున్నారు. మిగిలిన 20 కాలవల నిర్మాణ పనుల ఊసెత్తడం లేదు.

Poor Drainage System In Vijayawada : విజయవాడలో మరుగు కాలవల్లో పూడిక తొలగింపు పనులు టెండర్లకే పరిమితమయ్యాయి. నగర పరిధిలో 133 కిలోమీటర్ల పొడవునా కాలవలు ఉన్నాయి. వీటిలో ఏటా ఈ పాటికే 70 శాతానికిపైగా పనులు పూర్తయ్యేవి. ఈసారి టెండర్లు పిలిచి ఎన్నికల కోడ్‌ పేరుతో పక్కన పెట్టారు. గట్టిగా వర్షం కురిసినపుడల్లా నగరంలోని అత్యధిక ప్రాంతాలు ఏరులవుతున్నాయి. బెంజిసర్కిల్‌ నుంచి ఎన్టీఆర్‌ సర్కిల్, దుర్గా థియేటర్‌ వరకు రోడ్లకు ఇరువైపులా భారీగా వర్షపు నీరు నిలిచిపోతుంది. నిర్మలాకాన్వెంట్, మొగల్రాజుపురం, ఏపీఐఐసీ కాలనీతోపాటు సింగ్‌నగర్‌ చుట్టుపక్కల అనేక ప్రాంతాలు నీటి ముంపునకు గురవుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన వరద నీటిపారుదల కాలవల పనులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అసంపూర్తిగా నిలిపివేసింది. ఫలితంగా వర్షాకాలం వచ్చిందంటే ప్రజలకు అవస్థలు తప్పట్లేదు.

ఐదేళ్లుగా పాలకుల నిర్లక్ష్యం - మురుగు కూపంగా మారిపోయిన నెల్లూరు నగరం - Drainage System in Nellore District

చిన్నపాటి వర్షం కురిస్తే చాలు గుంటూరులోని పల్లపు ప్రాంతాలు జలమయం కావడం లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడం సర్వసాధారణమవుతోంది. ఉద్ధృతంగా ప్రవహించే కాలవల్లో చిన్నారులు కొట్టుకుపోతుంటారు. వర్షాకాలం సమీపిస్తున్నా నగరపాలక సంస్థ ఇప్పటికీ కాలవల్లో పూడికలు తొలగించే పనులు ప్రారంభించలేదు. ఏటా కొద్దిపాటి వర్షానికే నగరంలోని అనేక రహదారులు జలమయమవుతుంటాయి. కాలవల్లోని చెత్త చెదారం రోడ్లపైకి వస్తుంది. వాగులు, కాలవల వెంట ఉన్న ఆక్రమణలు తొలగించి వర్షపు నీరు రోడ్లపైకి రాకుండా చూడాలని పట్టణ ప్రణాళిక విభాగానికి ఈనెల 15న ఆస్తి పన్ను చెల్లింపుదారుల సంఘం లేఖ రాసినా స్పందన లేదు.గతేడాది సరైన ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల ముంపుతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. నగరంలో దాదాపు 25 ప్రాంతాలు వర్షాకాలంలో ముంపునకు గురవుతున్నాయి. సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవలసిన నగరపాలక సంస్థ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.

నెల్లూరులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా అధికారుల్లో ఎలాంటి చలనం లేదు. పూడిక తొలగించకపోవడం, ఆక్రమణలు క్రమంగా పెరిగిపోవడంతో కొద్దిపాటి వర్షానికి నగరం జలమయమవుతోంది. ప్రతి ఏటా ఇదో పెద్ద సమస్యగా తయారవుతున్నా యంత్రాంగం ఉదాసీనంగానే వ్యవహరిస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు పూడిక పనులు ప్రారంభం కాలేదు. ప్రత్యేకించి నగరంలోని పంట కాలవల్లో భారీగా పేరుకుపోయిన పూడికను తొలగిస్తే ముంపు సమస్య చాలావరకు పరిష్కారమవుతుంది. ఇటు నగరపాలక సంస్థ, అటు జలవనరులశాఖ ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో వర్షాకాలంలో ఏటా మనసునగర్, కుదుస్‌నగర్, పరమేశ్వర్‌నగర్, మనుమసిద్ధినగర్‌ తదితర ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. కొన్ని చోట్ల ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతుంటారు. ఇకనైనా అధికారులు మొద్దునిద్ర వీడి పూడిక తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

ఐదేళ్లుగా పాలకుల నిర్లక్ష్యం - ముందుకు సాగని పట్టణ, నగరాభివృద్ధి - Negligence on Urban Development

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.