ETV Bharat / state

బహుముఖ వ్యూహాలతో ప్రచారాలు- బైక్​ ర్యాలీలతో మద్దతు తెలుపుతున్న అభిమానులు - Lok Sabha Elections 2024

Political Parties Has Intensified Campaign For General Elections 2024: రాష్ట్రంలో ఎన్నికల కోడ్​ అమలు కావడంతో రాజకీయ పార్టీలు ప్రచారాలను జోరుగా సాగిస్తున్నాయి. టీడీపీ నేతలకు మద్ధతుగా అభిమానులు బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి కూటమిని గెలిపించాలని నేతలు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Political Parties Has Intensified Campaign For General Elections

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 17, 2024, 7:10 AM IST

బహుముఖ వ్యూహాలతో ప్రచారాలు- బైక్​ ర్యాలీలతో నేతలకు మద్దతు తెలుపుతున్న అభిమానులు

Political Parties Has Intensified Campaign For General Elections 2024: సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడిన నేపథ్యంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేనలు ప్రచారాలను ముమ్మరం చేశాయి. బహుముఖ వ్యూహాలతో అన్ని పార్టీలూ రణానికి సన్నద్ధమవుతున్నాయి. కేంద్ర ఎన్నికల కమిషన్‌ అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరపాలని నిర్ణయించడంతో ఇన్నాళ్ల ఉత్కంఠకు తెరపడటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కూటమిని గెలిపించాలని నేతలు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జగన్‌ పాలనలో జరిగిన నష్టాన్ని మూడు పార్టీల నేతలు ప్రజలకు వివరించారు. వైసీపీ నుంచి నాయకుల వలసలు కొనసాగాయి.

రాష్ట్రంలో ఎన్నికల కోడ్- వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనే వీల్లేదు : CEO

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావును జనసేన నేత కందుల దుర్గేష్ కలిశారు. తన విజయానికి సహకరించాలని ఆయన కోరారు. అనపర్తి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి మద్ధతుగా అయన అభిమానులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు నరసాపురం నియోజకవర్గంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. చిలకలూరిపేటలో జరగనున్న ఉమ్మడి సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. బాపట్ల జిల్లా అద్దంకికి చెందిన వైసీపీ నేత బాచిన కృష్ణ చైతన్య తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.

ఎన్నికల షెడ్యూల్ రాకతో ఏపీ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చింది - వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైంది: చంద్రబాబు

తిరుపతిలో వైసీపీ నేతల అక్రమాలను కుటమి అధికారంలోకి వచ్చాక వెలికి తీస్తామని అరణి శ్రీనివాసులు అన్నారు. నగరంలోని సింగాలగుంటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో కూటమి అభ్యర్థి సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో తెలుగుదేశం కార్యాలయం ఎదుట టపాసులు కాల్చారు. ఎన్నికల కోడ్‌ వెలువడగానే రాక్షస పాలన ముగిసిందని సంతోషం వ్యక్తం చేశారు. ఓ వైపు సిద్ధం మరోవైపు సై అని భారీ హోర్డింగులు ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీలు షెడ్యూల్‌ ప్రకటనతో మరింత అప్రమత్తం అయ్యాయి.

​ఏడు దశల్లో 2024 లోక్​సభ ఎన్నికలు- జూన్​ 4న కౌంటింగ్- పూర్తి​ షెడ్యూల్​ ఇదే

వచ్చే ఎన్నికల్లో వైసీపీను ఇంటికి పంపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సబ్యుడు శ్రీనివాసుల రెడ్డి అన్నారు. అన్ని వ్యవస్థలను నాశనం చేసిన జగన్ భారీ ఓటమిని మూట గట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. కర్నూలులోని చిదంబరావు పేటలో టీజీ. భరత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలు ఆయనకు హారతులు పట్టి స్వాగతం పలికారు. ఇప్పటి వరకు ప్రచారం చేసుకున్న పార్టీల నాయకులపై ఇక ఎన్నికల కోడ్​ను ఝుళిపించనున్నారు. అధికార పార్టీ నేతల ఆదేశాలకు తలూపిన పరిపాలన, పోలీసు యంత్రాంగం ఎన్నికల సంఘం పరిధిలోకి వచ్చారు.

రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ - ఫ్లెక్సీల తొలగింపు - నేతల విగ్రహాలకు ముసుగు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.