Political Parties Election Campaign is Full Swing: ఎన్నికల వేళ రాజకీయ పార్టీల ప్రచారం ఊరూవాడా జోరుగా సాగుతోంది. కూటమి అభ్యర్థులు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నారు. తెలుగుదేశంలోకి వైసీపీ నేతలు, కార్యకర్తల వలసలు కొనసాగుతున్నాయి. జయహో బీసీ సభలు, ఆత్మీయ సమావేశాలతో కూటమి అభ్యర్థులు జోరు పెంచారు. వివిధ కులాలు, వర్గాల నేతలు కూటమికి మద్దతుగా నిలుస్తున్నాయి.
వారాహి యాత్రలో పవన్‌పై రాళ్ల దాడికి యత్నం- యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
జోరుగా కూటమి నేతల ప్రచారాలు: మంగళగిరి తెలుగుదేశం అభ్యర్థి నారా లోకేశ్‌కు మద్దతుగా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తాడేపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కృష్ణా జిల్లా పామర్రులో కూటమి ఎంపీ అభ్యర్థి బాలశౌరి, ఎమ్మెల్యే అభ్యర్థి వర్ల కుమార్ రాజా ప్రచారం నిర్వహించారు. పార్వతీపురం జిల్లా పాలకొండలో అరకు ఎంపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత, పాలకొండ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ రోడ్ షో నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులో టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య ప్రచారం చేశారు. జనసేన అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ సతీమణి విజయలక్ష్మి ప్రచారంలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో కూటమి అభ్యర్థి బాలరాజు స్థానిక సమస్యలు తెలుసుకున్నారు.
నగరిలో రోజా దోపిడీకి అడ్డేలేదు- ఆమె ఇంట్లో నలుగురు మంత్రులు : షర్మిల - YS Sharmila on Roja
శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువులో పుట్టపర్తి కూటమి అభ్యర్థి పల్లె సింధూరరెడ్డి ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అడిగారు. రామగిరి మండలంలో మాజీ మంత్రి పరిటాల సునీత సమక్షంలో 20 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరాయి. అనంతపురం జిల్లా కనేకల్ మండలం గంగులాపురంలో రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలువ శ్రీనివాసులు, పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ ప్రచారం నిర్వహించారు.
కళ్యాణదుర్గంలో వాల్మీకుల ఆత్మీయ సమ్మేళనానికి కాలువ శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. చిత్తూరు గ్రామీణ మండలంలో కూటమి అభ్యర్ధి గురజాల జగన్మోహన్ ప్రచారం నిర్వహించారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గౌరు చరిత ఓర్వకల్లు మండలంలో రోడ్ షో నిర్వహించారు. కొమరోలు, పూడిచర్లకు చెందిన 250 కుటుంబాలు టీడీపీలో చేరాయి.
'వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి'- ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థులు - ELECTION CAMPAIGN
ఓట్లను అభ్యర్థిస్తున్న నేతలు: తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో మైనార్టీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం కొత్తపాలెంలో ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో జయహో బీసీ సదస్సు నిర్వహించారు. జగన్ వైఖరితోనే రాష్ట్రంలో పేరొందిన కంపెనీలు ఇక్కడి నుంచి వెళ్లిపోయాయని, కొత్త పరిశ్రమలు రావటం లేదని టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. గుంటూరులోని ఓ ఫంక్షన్ హాల్లో యువతతో జరిగిన సమావేశంలో పెమ్మసాని, గుంటూరు పశ్చిమ టీడీపీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి పాల్గొన్నారు.
కల్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు వికలాంగులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ ఆధ్వర్యంలో నిర్విహించిన చేనేతల ఆత్మీయ సమావేశానికి ఎంపీ సంజీవ్ కుమార్, కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి హాజరయ్యారు. నేడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 'యువశక్తి' పేరుతో భారీ బహిరంగ సభకు మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏర్పాట్లు చేశారు.
అమలాపురంలో జరిగిన కాపు జేఏసీ సమావేశంలో కూటమికి మద్దతు తెలుపుతూ నేతలు తీర్మానం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో టీడీపీ నేత దొమ్మేటి వెంకట సుధాకర్ అధ్యక్షతన జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని మాజీమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం గంగన్నగూడెంలో నిర్వహించిన యాదవుల ఆత్మీయ సమావేశానికి కూటమి ఎంపీ అభ్యర్థి మహేష్ యాదవ్‌తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
వందల కోట్ల ప్రభుత్వ ధనంతో జగన్ సిద్ధం సభలు: బాలకృష్ణ - balakrishna election campaign