ETV Bharat / state

జోరుగా ఎన్నికల ప్రచారం - ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్న నేతలు - ALL PARTIES ELECTION CAMPAIGN - ALL PARTIES ELECTION CAMPAIGN

Political Parties Election Campaign: ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాలతో దూసుకుపోతున్నాయి. టీడీపీ అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ పార్టీ చేపట్టబోయే అభివృద్ది కార్యక్రమాలు, తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. అధికార పార్టీ నేతలకు ప్రజల నుంచి నిరసన సెగ తగులుతుంది. ప్రచారానికి వెళ్లిన నేతలను స్థానిక సమస్యలపై వారిని ప్రశ్నిస్తున్నారు.

political Parties Start With Election Campaign

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 27, 2024, 8:01 AM IST

జోరుగా ఎన్నికల ప్రచారం - ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్న నేతలు

Political Parties Election Campaign: ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార, ప్రతిపక్షాలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇంటింటికి తిరిగి తమ పార్టీ చేపట్టే కార్యక్రమాలను నేతలు ప్రజలకు వివరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరిష్కరిస్తామని భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎన్నికల ప్రచారం పోటాపోటీగా జరిగింది. విజయనగరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, విజయనగరం మండలం ముడిదాంలో ఇంటింటి ప్రచారం చేశారు. రాజాం వైసీపీ అభ్యర్థి తలే రాజేష్‌ గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయనగరం పార్లమెంటు అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌, రాజేష్‌తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. పార్వతీపురం వైసీపీ అభ్యర్థి అలజంగి జోగారావు, విజయనగరం వైసీపీ అభ్యర్థి ఇంటింటి ప్రచారం చేపట్టారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి ఆలయంలో పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

పవన్ కల్యాణ్​ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఫిక్స్ - పిఠాపురం నుంచే సమరశంఖం - Pawan Kalyan Election Campaign

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. విజయీభవ యాత్ర పేరుతో ఆత్మకూరు మండలం వాసిలిలో పర్యటించిన విక్రమ్‌రెడ్డిని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీ మహిళలు సమస్యలపై ప్రశ్నించారు. వారికి వైసీపీ నాయకులు సర్ది చెప్పారు. సీఎం జగన్‌ బటన్‌ నొక్కినా ఆసరా, చేయూత పథకాల డబ్బులు జమకాలేదని బీసీ కాలనీ మహిళలు నిలదీశారు. వైఎస్సార్​ జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలం సిద్ధారెడ్డి గారి పల్లెలో బీటెక్‌ రవి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలను ఆయన ప్రజలకు వివరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

టీడీపీ ఎన్నికల ప్రచారం షురూ - నేటి నుంచి ప్రజల్లోకి చంద్రబాబు

కర్నూలు తెలుగుదేశం అభ్యర్థి టి.జి. భరత్ నగరంలోని చిన్న మార్కెట్లో ఇంటింటి ప్రచారం చేశారు. టి.జి. భరత్​కు స్థానికులు బ్రహ్మరథం పట్టారు. చిన్న మార్కెట్లో తన తండ్రి టి.జి. వెంకటేశ్ సొంత నిధులతో నిర్మించిన నగరపాలక ప్రాథమిక పాఠశాల వద్ద తమ టీజీవీ సంస్థలు చేసిన అభివృద్ధి పనులను ఆయన ప్రజలకు చూపించారు. తమకు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో తన తండ్రి పేరుతో ఉన్న బోర్డును వైసీపీ నేతలు చెరిపేశారని భరత్​ మండిపడ్డారు. తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అధికారంలోకి వాటిని కచ్చితంగా అమలు చేసి ప్రజలకు ఉత్తమ భవిష్యత్తు అందిస్తామని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కళ్యాణదుర్గం అభ్యర్థి సురేంద్రబాబు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. శెట్టూరు మండలంలోని గ్రామాల్లో రోడ్ షోలు నిర్వహించారు.

ఏపీలో వేడెక్కుతున్న రాజకీయాలు - ప్రచారానికి సిద్ధమైన జగన్, చంద్రబాబు - Political Heat in AP

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.