Police Solved a Case of Theft in Bus at Kavali: నెల్లూరు జిల్లా కావలి సమీపంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 77.50 లక్షల రూపాయల నగదును రికవరీ చేశారు. ఈ చోరీకి ప్రధాన కారణం నగదు తరలించిన వ్యక్తేనని ఏఎస్పీ సౌజన్య తెలిపారు. నగదు తరలిస్తున్న వ్యక్తి పథకం ప్రకారం స్నేహితులతో కలిసి చోరీ చేసినట్లు తెలిపారు. చోరీ వివరాలను ఏఎస్పీ మీడియాకు వెల్లడించారు.
చెన్నైలోని ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో అకౌంట్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న హరినాథ్ రెడ్డి ఈ నెల 1వ తేదీన 80 లక్షల రూపాయల నగదుతో విజయవాడ నుంచి చెన్నైకి ఓ ప్రయివేటు బస్సులో బయలుదేరాడని తెలిపారు. డబ్బు గురించి హరినాథ్ రెడ్డి ముందుగానే తన స్నేహితులైన రమేష్, వినోద్లకు సమాచారం ఇవ్వగా వారు కూడా అదే బస్సులో ప్రయాణికులుగా వస్తున్నారని ఏఎస్పీ వెల్లడించారు. బస్సు నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని రుద్రకోట దగ్గర ఓ దాబా వద్ద ఆగగా, రమేష్, వినోద్‌లు ఆ డబ్బు సంచులను తీసుకుని వెనుక వస్తున్న కారులో పరారయ్యారని తెలిపారు.
దంపతుల మధ్య గొడవ - క్షణికావేశంలో భర్తను చంపిన భార్య
తనకు మత్తు మందు ఇచ్చి ఎవరో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు డబ్బు సంచులు ఎత్తుకెళ్లినట్లు హరినాథ్ రెడ్డి కావలి పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారించి డబ్బు తరలిస్తున్న హరనాథ్ రెడ్డే చోరీకి సూత్రదారని గుర్తించినట్లు వెల్లడించారు. ఈ కేసులో చిత్తూరు జిల్లాకు చెందిన హరనాథ్ రెడ్డి, అన్నమయ్య జిల్లాకు చెందిన వినోద్, రమేష్‌లతో పాటు కర్ణాటకకు చెందిన యాసిన్ బాషలను అరెస్ట్ చేసి, వీరి నుంచి 77.50 లక్షల నగదు, ఓ కారు, అయిదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. 24 గంటల్లో కేసు చేధించిన కావలి పోలీసులను ఏఎస్పీ సౌజన్య అభినందించారు.
టెస్లాతో ప్రభుత్వం సంప్రదింపులు - పెద్ద కంపెనీలకు అధికారుల లేఖలు - Tesla Management on Investments