Police Seized Heavy Liquor in Pithapuram: ఎన్నికల సమీపిస్తున్న వేళ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోంది. అధికార పార్టీకి చెందిన నేతలు భారీగా మద్యం నిల్వ చేసినట్టు ఫిర్యాదులు అందడంతో ఎస్‌ఈబీ అధికారులు, పోలీసులు కలిసి దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నాలుగు ప్రాంతాల్లో అక్రమ మద్యం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. పట్టణంలోని జగ్గయ్యచెరువు, సాలిపేట, వైఎస్‌ఆర్ గార్డెన్, కుమారపురం కాలనీల్లోని ఇళ్లలో నిల్వ చేసిన రూ.80 లక్షల విలువైన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
ఒక ఇంట్లోనే 2,560 లీటర్లకు పైగా మద్యం పట్టుబడింది. వేల కొద్దీ రాయల్ బ్లూ బ్రాండ్, గోవా కిక్ మద్యం సీసాలు నిల్వ చేసినట్టు అధికారులు తెలిపారు. ఎస్‌ఈబీ అధికారి మహబూబ్ అలీ ఆధ్వర్యంలో ఇంకా సోదాలు జరుగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటంతో పిఠాపురం నియోజకవర్గం ప్రత్యేకతను సంతరించుకుంది. దీంతో ఎన్డీయే కూటమి, వైసీపీ మధ్య గట్టిపోటీ నెలకొంది. వైసీపీ నేతలు పెద్ద ఎత్తున మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నారని జనసైనికులు ఆరోపిస్తున్నారు.
TDP leader Verma Reacted on Liquor Seize: పవన్ కల్యాణ్‌ను ఓడించేందుకు నాలుగైదు లారీల మద్యం దించారని పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జి వర్మ ఆరోపించారు. పట్టణంలో భారీగా మద్యం పట్టుబడటంపై వర్మ స్పందించారు. డబ్బు, మద్యం పంపిణీ చేసి పిఠాపురంలో గెలవాలని వైసీపీ ప్రయత్నిస్తోందని అన్నారు. పవన్‌ను ఓడించేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు.
బీసీలకు జగన్ తీరని ద్రోహం - బ్యాక్‌బోన్ అని కీర్తిస్తూనే వెన్నుపోటు - CM Jagan Cheated BC
SEB Officials Caught Illegal Liquor in Kakinada: కాకినాడలో భారీగా తరలిస్తున్న మద్యాన్ని సెబ్ అధికారులు పట్టుకున్నారు. ఇంద్రపాలెం అంబేడ్కర్ కూడలి సమీపంలో మద్యం తరలిస్తున్న టాటా ఏసీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలుల రూ.21 లక్షలు ఉంటుందని సెబ్ సూపరింటెండెంట్ రవికుమార్ వెల్లడించారు. ఎన్నికల వేల భారీగా మద్యం స్వాధీనం చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. మూడు వాహనాల్లో మద్యాన్ని తరలిస్తున్నారని అనుమానాలు వస్తుండగా వాటి గురించి మీడియా ప్రతినిధులు సెబ్ అధికారులను ప్రశ్నించారు. వాటి గురించి తమకు తెలియదని అధికారులు తెలిపారు. వాహన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రవికుమార్ తెలిపారు.
దివ్యాంగులకు వైసీపీ సర్కార్ ద్రోహం - కనికరం లేకుండా రాయితీలు ఎత్తివేత - Disabled people struggled