Police Seized 22kg of Ganja in Vizianagaram : రాష్ట్రంలో గంజాయి నిర్మూలకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ ఆదేశాల మేరకు పోలీసులు గంజాయి రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా విజయనగరంలోని ధర్మపురి ప్రాంతంలో వసంత విహర్ విల్లాలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మిరట్, దిల్లీకి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ముగ్గురు గత ఏడాది కాలంగా విజయనగరం నుంచి దిల్లీకి గంజాయి సరఫరా చేస్తున్నట్లు విజయనగరంజిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలియచేశారు.
విజయనగరం నుంచి దిల్లీకి ఏడాది కాలంగా గంజాయి రావాణా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. విజయనగరం వసంత విహర్ విల్లాలో మీరట్, దిల్లీకి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 22కిలోల గంజాయితోపాటు, రవాణాకు వినియోగిస్తున్న వస్తువులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేస్తున్నారు. మీరట్‌కు చెందిన వసీం అరకులోని విశ్వనాథం నుంచి గంజాయి కొనుగోలు చేసి అలాం, ఖుర్షిద్ ద్వారా దిల్లీకి రవాణా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ముఠాలో ప్రధాన నిందితుడు కబీర్ దిల్లీ నుంచి లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కేసులో మొత్తం 9 మంది పాత్ర ఉందని, మిగతావారినీ పట్టుకుంటామని ఎస్పీ వెల్లడించారు.
గుడివాడలో..
గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీకాళహస్తి కాలనీ ఊరు బయట దొండపాడు వెళ్లే రోడ్డులో ఒక బాలుడు భారీగా గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడన్న రహస్య సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. గుడివాడ రూరల్ ఎస్సై చంటి బాబు వారి సిబ్బందితో కలిసి గుడివాడ తహసిల్దార్ సమక్షంలో ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ క్రమంలో ఒక బాలుడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 6 కేజీల 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసు వారు అక్కడకు చేరుకోక ముందే అక్కడ నుంచి తప్పించుకుని పారిపోయిన ఇద్దరి కోసం రెండు ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం గుడివాడ రూరల్ సీఐ సోమేశ్వరరావు ప్రెస్‌మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా గంజాయి విక్రయాలు జరిపినా, రవాణా చేసినా లేదా గంజాయి సేవించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అదేవిధంగా వారిపై రౌడీ షీట్లు తెరుస్తామని హెచ్చరించారు.
స్నేహం నటించి.. వృద్ధురాలిని హత్య చేసి బంగారం కాజేసిన పక్కింటి మహిళ - SP Vakul Jindal Press Meet