Police Ready To Arrest YSRCP leader Pinnelli Ramakrishna Reddy: మాచర్ల వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎస్పీ కార్యాలయంలో పిన్నెల్లి సంతకం చేశారు. ఇటీవల జరిగిన పాలువాయి గేటు పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈవీఎంను పగలగొట్టిన కేసులో హైకోర్టు అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చింది. 6వ తేదీ వరకు ఎస్పీ కార్యాలయంలో ప్రతిరోజూ సంతకం పెట్టాలని హైకోర్టు ఆదేశించింది.
ఈ మేరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సంతకం చేసి తిరిగి నరసరావుపేటలోని వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. అయితే నేటితో హైకోర్టు ఇచ్చిన మినహాయింపు పూర్తవుతుంది. ఏక్షణమైనా పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో పల్నాడు జిల్లాలో ఉత్కంఠ నెలకొంది.