ETV Bharat / state

మదనపల్లె అగ్ని ప్రమాదంపై ప్రభుత్వం సీరియస్ - దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసుశాఖ - Madanapalle Fire Accident Case - MADANAPALLE FIRE ACCIDENT CASE

Madanapalle Fire Accident Case Updates : మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయాన్ని తగలబెట్టిన కేసును సీరియస్‌గా తీసుకున్న సర్కార్ అన్ని కోణా‌ల్లోనూ విచారణ చేస్తోంది. ఈ ఘటన వెనక కుట్రకోణం దాగి ఉందని భావిస్తుండగా, అందుకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు సైతం లభించాయి. ప్రమాదానికి ముందు రెవెన్యూ సిబ్బంది కార్యాలయంలోనే ఉండటంపైనా ఆరా తీస్తోంది. ఇందులోని కుట్రకోణాన్ని వెలికితీసేందుకు పదిబృందాలను ప్రభుత్వం నియమించింది.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 23, 2024, 8:59 AM IST

Madanapalle Sub Collector Office Fire Accident : అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్‌ ఆఫీసు దహనం కేసులో ప్రభుత్వం ముమ్మర విచారణ చేపట్టింది. నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయమే ఈ కేసును పర్యవేక్షించడం, డీజీపీ, సీఐడీ చీఫ్‌ స్వయంగా ఘటనాస్థలాన్ని పరిశీలించడంతో అధికారులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. మదనపల్లె ఆర్డీవో హరిప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగి కీలక దస్త్రాలు కాలిపోతున్నా కలెక్టర్‌కు గానీ, ఎస్పీకి గానీ సమాచారం ఇవ్వకపోవడంపై ఆరా తీస్తున్నారు.

AP Govt on Madanapalle Fire Accident : పోలీసులు ఎస్పీకి సమాచారం ఇవ్వగా ఆయన కలెక్టర్‌కు ఫోన్‌లో విషయం చెప్పారు. హరిప్రసాద్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. హరిప్రసాద్ స్థానంలో కొత్త ఆర్డీవో ఛార్జ్ తీసుకోవడానికి కొన్ని గంటల ముందు దస్త్రాలు తగలబడిపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆదివారం సెలవురోజు అయినప్పటికీ ఓ ఉద్యోగి కార్యాలయంలో రాత్రి పదిన్నర వరకు ఉండటం, అతను వెళ్లిపోయిన తర్వాతే కార్యాలయం తగలబడటం చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం ఉన్న ఆర్డీవో హరిప్రసాద్‌ కన్నా ముందు, మదనపల్లె ఆర్డీవోగా పనిచేసిన మురళి శనివారం మదనపల్లెలోనే మకా వేశారు. ఆ తర్వాత రోజే సబ్‌కలెక్టరేట్‌లో మంటలు చెలరేగడం మరింత అనుమానాలు రేకెత్తిస్తోంది. ఆయన ప్రస్తుత ఆర్డీవో హరిప్రసాద్‌తోనూ భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కార్యాలయంలో పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాలకు చెందిన భూముల దస్త్రాలన్నీ ఉన్నాయి. దీంతో మురళిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు : మురళి మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఒంగోలులో పనిచేసిన సమయంలో చేసిన అక్రమాలు రుజువుకావడంతో, మదనపల్లె ఆర్డీవోగా ఉన్న సమయంలోనే మురళిని సస్పెండ్ చేయడంతోపాటు తహసీల్దార్‌గా రివర్షన్ ఇచ్చారు. కానీ ఆయన పెద్దిరెడ్డి అండదండలతోనే సస్పెన్షన్‌ ఎత్తివేయించుకుని మళ్లీ ఆర్డీవోగా నియమితులయ్యారు. వీరిరువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

అసలేం జరిగిదంటే : మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ప్రధాన కార్యాలయంలోని రెవన్యూ రికార్డులు, కంప్యూటర్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే కార్యాలయంలోని విలువైన వస్తువులు పూర్తిగా కాలి బూడిదైన విషయం తెలిసిందే.

మదనపల్లె అగ్ని ప్రమాదంపై ఎన్నో అనుమానాలు- డీజీపీ విచారణలో విస్తుపోయే వాస్తవాలు - Fire accident at Madanapally

మదనపల్లె ఘటనపై సీఎం సీరియస్-తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లాలని డీజీపీ, సీఐడీ చీఫ్ కు ఆదేశాలు - records burning

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.