810 kg ganja seized in Andhra Pradesh: గంజాయి రవాణాకు పుష్ప సినిమా తరహాలో నిందితులు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. పోలీసులమని చెప్పి వాహనానికి ఏకంగా బోర్డు ఏర్పాటు చేసి తరలిస్తున్న వైనం పార్వతీపురం మన్యం జిల్లాలో వెలుగు చూసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో విలేకరులకు తెలిపారు. ఒడిశా నుంచి బొగ్గు లారీ, రెండు వ్యానుల్లో గంజాయి తరలిస్తుండగా కొట్టక్కి చెక్ పోస్టు వద్ద పట్టుకున్నామని, మూడు వాహనాలను సీజ్ చేశామని తెలిపారు. నిందితులు మధ్యప్రదేశ్‌కు చెందిన హక్కూం సోలంకి, ఆయన కుమారుడు అనిల్ సోలంకి, ఒడిశా వాసి జ్యోతిభూషణ్ బెహరాను అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు చెప్పారు. వీరి వద్ద 810 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని, వాహనాలకు పోలీస్ బోర్డుతో పాటు ఫేక్ నంబర్లు పెట్టుకొని రవాణా చేస్తున్నట్లు పేర్కొన్నారు. సీఐ నారాయణరావు, ఎస్‌ఐ ప్రసాదరావు పాల్గొన్నారు.
నీళ్లలో ఆకులు వేసి వేడి చేసి - దొరక్కుండా గంజాయి స్మగ్లర్ల అతి తెలివి
విజయనగరం జిల్లాలో318 కిలోల గంజాయి: పాచిపెంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు ఉదయం పాచిపెంట పోలీసు వారికి వచ్చిన సమాచారం మేరకు మతమూరు గ్రామం దగ్గరలో వేటగానివలస జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అరకు సాలూరు రోడ్డు నుంచి తెల్లని కారు నంబర్ ప్లేట్లు లేకుండా రావడంతో పోలీసులు ఆపి తనిఖీ చేశారు. ఆ కారులో ఇద్దరు వ్యక్తులతో సహా 9 బ్యాగుల గంజాయి దొరికింది. ఆ ఇద్దరు వ్యక్తులను విచారించగా అందులో మొదటి వ్యక్తి పేరు మద్దాల వంశీ, అతను ఆ కారుని డ్రైవ్ చేస్తూ వచ్చి అతనితో పాటు రెండో వ్యక్తి అయిన సుబ్బారావును సైతం పోలీసులు విచారించారు.
అయితే పెదబయలు ఏరియాలో ఈ గంజాయిని బాలు అనే వ్యక్తి వద్ద నుంచి కొని కారులో లోడ్ చేసుకొని అరకు సాలూరు రోడ్డు లోతేరు మీదుగా వస్తుండగా మాతమూరు జంక్షన్ వద్ద వీరు పోలీసులకు పట్టుబడ్డారు. కారులో మొత్తం తొమ్మిది బ్యాగుల్లో సుమారు 318 కేజీలు గంజాయి ఉంది. గంజాయిని విజయనగరం హైవేలో రాజస్థాన్ కు చెందిన లారీల్లో లోడ్ చేసి వరంగల్ మీదుగా వెళుతున్నట్లు తెలిసింది. వీరి వద్ద నుంచి గంజాయి, కారు, రెండు సెల్ఫోన్లను సీజ్ చేశారు. గంజాయి విలువ సుమారు 16 లక్షలు ఉంటుందని పోలీసులు ప్రకటించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అదనపు ఎస్పీ దిలీప్ కిరణ్ తెలిపారు.