ETV Bharat / state

వెలుగుల పండగ వేళ కండీషన్స్ అప్లయ్ - ఆ సమయంలో సిగరెట్ కాల్చకండి! - CONDITIONS TO FIREWORKS SHOPS

దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా దుకాణాల వద్ద పోలీసులు - అగ్నిమాపకశాఖ సిబ్బందితో కలిసి ప్రత్యేక చర్యలు

police_conditions_to_fireworks_shops_and_diwali_safety_precautions
police_conditions_to_fireworks_shops_and_diwali_safety_precautions (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 30, 2024, 5:49 PM IST

Updated : Oct 30, 2024, 7:05 PM IST

Police Conditions to Fireworks Shops And Diwali Safety Precautions : దీపావళి వచ్చిందంటే చాలు చిన్నాపెద్దలు అంతా సంతోషంగా వెెలుగుల పండుగ జరుపుకొంటారు. చిన్నారులు ఎగిరి గంతేస్తారు. ఎప్పుడెప్పుడు టపాసులు కాలుస్తామా అని నిరీక్షిస్తారు. ఎక్కువ కాంతిని ఇచ్చే టపాసులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. నూతన పరిజ్ఞానంతో వచ్చే క్రాకర్స్​ను కొనుగోలు చేస్తుంటారు. దీపావళి పండుగ వైభవంగా జరుపుకొనేందుకు ఉత్సాహంగా టపాసులు కాలుస్తారు. అయితే పండుగ జరుపుకొనే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికారులు సూచిస్తున్నారు.

Precautions for Diwali Celebrations : క్రాకర్స్ విక్రయించే దుకాణదారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. బాణాసంచా విక్రయించే దుకాణాల మధ్య కనీసం మూడు అడుగుల దూరం ఉండాలని సూచిస్తున్నారు. పొరపాటున అగ్ని ప్రమాదాలు జరిగితే వాటిని అరికట్టేందుకు కావాల్సిన నీటిని అందుబాటులో ఉంచుకోవాలని, ప్రమాదాలను నివారించే అగ్నిమాపక పనిముట్లు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. టపాసులు రవాణా చేసేటప్పుడు, దుకాణాల్లో సర్దుకునే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలుపుతున్నారు. దీపావళి టపాసులు తదితర వస్తువులు అమ్మే ప్రాంతంలో సిగరెట్లు కాల్చకుండా చూసుకోవాలని దుకాణ యజమానులకు వివరించారు.

"దీపావళి ధమాకా" ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు - కేబినెట్‌ ఆమోదం

Diwali Celebrations in Andhra Pradesh : గతంలో విజయవాడలో నాసిరకమైన టపాసులు క్రమంలో నిర్లక్ష్యం వహించినందుకు భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రాణనష్టం కూడా సంభవించి అందర్నీ కలచివేసింది. అటువంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు క్రాకర్స్​ను కాల్చేటప్పుడు చిన్నారులు జాగ్రత్తలు తీసుకోవాలని కంటి వైద్యులు సూచిస్తున్నారు. టపాసులు పేలే సమయంలో వెలువడే వాయువులు పీలిస్తే ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు.

Police Conditions to Firecrackers Shpos : దీపావళి పండుగ సందర్భంగా ప్రకాశం జిల్లా కనిగిరిలో బాణసంచా దుకాణాల వద్ద పోలీసులు, అగ్నిమాపకశాఖ సిబ్బందితో కలిసి ప్రత్యేక చర్యలు చేపట్టారు. వ్యాపారులు బాణసంచా విక్రయ దుకాణాల ఏర్పాటుకు ఆయా శాఖల నుంచి అనుమతులు పొందినప్పటికీ పట్టణానికి దూరంగా ఏర్పాటు చేసేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. టపాసుల దుకాణాల వద్ద కచ్చితంగా ఇసుక, నీరు ఉంచుకోవాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 94 బాణాసంచా దుకాణాలకు తాత్కాలిక లైసెన్సులు జారీ చేయడంతో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పట్టణంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన దుకాణాలకు ప్రజలు పెద్దఎత్తున వస్తున్నారు. బాణసంచా ధరలపై నియంత్రణ లేకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారని కొనుగోలుదారులు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు

'సంక్రాంతి వరకు గుంతలు పూడ్చేస్తాం- దీపావళికి ఉచిత సిలిడర్​ అందుతుంది'

Last Updated : Oct 30, 2024, 7:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.