ETV Bharat / state

కారెత్తుకెళ్లాడు - చల్లగాలికి నిద్రలోకి - సీన్​ కట్​ చేస్తే - THIEF SLEEPING IN STOLEN CAR

రాయచోటి - పులివెందుల బైపాస్‌ రోడ్డులో అర్ధరాత్రి కారు చోరీ - నంబర్‌ ప్లేట్లు తొలగించి కారులో నిద్రపోయిన దొంగ

thief_sleeping_in_stolen_car
thief_sleeping_in_stolen_car (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 14, 2024, 4:34 PM IST

Police Caught Thief Sleeping in Stolen Car at Kadapa District: కడప జిల్లా ఓ దొంగ అందరూ నవ్వుకునే విధంగా ఓ దొంగతనం చేశాడు. రోడ్డుపై ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని గుట్టుచప్పుడు కాకుండా దొంగిలించారు. అనుకున్న పని అయిపోయింది అనుకుని అక్కడి నుంచి బండితో పరార్ అయ్యాడు. కొంత దూరం వెళ్లాక నెంబర్ ప్లేట్లు ఉంటే దొరికిపోతానేమో అనుకుని బండిని ఆపి నెంబర్ ప్లేట్లను తొలగించి హమ్మయ్యా అనుకున్నాడు. అయితే అక్కడే గమ్మత్తు చోటు చేసుకుంది. బండి అద్దాలను దించడంతో చల్లగా గాలి వీచింది. ఇంకేముంది మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు. తీరా నిద్రలేవగానే పోలీసులు ప్రత్యక్షమయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.

అద్దాలను పైకెత్తి చల్లగా నిద్రలోకి: జిల్లాలోని వేంపల్లి పట్టణ సమీపంలోని రాయచోటి - పులివెందుల బైపాస్ రోడ్డు పక్కన శివారెడ్డి అనే వ్యక్తి ఇటీవల వరి పంట కోసుకొని వడ్లను రోడ్డుపై ఆర వేసుకున్నాడు. ఆ వడ్ల దగ్గర వాళ్ల తండ్రిని కాపలాగా పెట్టాడు. అసలే చలికాలం పైగా మంచు కూడా కురుస్తుంది. ఈ క్రమంలో తన తండ్రి ఇబ్బంది పడకూడదని తన బొలెరో వాహనంలో నిద్రిస్తాడులే అని AP 39 DF 2408 నెంబరు గల బొలెరో వాహనాన్ని అక్కడ పెట్టాడు. ఇదే అదునుగా చూసుకున్న దొంగ అర్ధరాత్రి 12 గంటల సమయంలో శివారెడ్డి తండ్రి బండిలో లేని సమయం చూసుకొని బండిని స్టార్ట్ చేసుకొని వెళ్లిపోయాడు. అలా కొంత దూరం వెళ్లాక వేంపల్లి పట్టణ సమీపంలోని సంచుల ఫ్యాక్టరీ వద్ద బండిని పక్కకు ఆపి బండి నెంబర్ ప్లేటు తొలగించి, అద్దాలను పైకెత్తి చల్లగా నిద్రలోకి జారుకున్నాడు.

తన వాహనం చోరీకి గురైందని గుర్తించిన శివారెడ్డి వెంటనే స్థానిక వేంపల్లి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు, బండి యజమానులు చుట్టుపక్కల గాలించగా వేంపల్లికి 3 కిలోమీటర్ల దూరంలో బొలెరో వాహనంలో దొంగ నిద్రిస్తూ కనిపించాడు. దొంగను లేపగా తనకేం తెలియదని బుకాయించాడు. బండితో సహా దొంగను కూడా వేంపల్లి పోలీస్ స్టేషన్​కు తీసుకొచ్చి విచారించడం ప్రారంభించారు. ఇది చూసిన స్థానిక ప్రజలు నవ్వుకున్నారు. చోరీ చేసిన వాహనాన్ని తీసుకెళ్లకుండా ఆపి నిద్రపోవడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మద్యం మత్తులో పోలీస్ స్టేషన్​లో భార్య - కాలనీలో బూట్లు చోరీ చేసిన భర్త

హైదరాబాద్​లో 108 చోరీ - సినిమా రేంజ్​లో పోలీసుల ఛేజింగ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.