Husband killed Wife at Bandlaguda in Hyderabad : భార్యపై అనుమానంతో భర్త ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్ నగరంలోని బండ్లగూడ ఠాణా పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ కె. సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం హాషామాబాద్ ఖాద్రియామసీదు ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫైజ్ ఖురేషి(25)కి పిసల్‌బండ, రియాసత్‌నగర్‌లో నివసించే ఖమర్‌బేగం(24)తో ఆరేళ్ల క్రితం క్రితం నిఖా జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. మహ్మద్ ఫైజ్ ఖురేషి ఆటో డ్రైవర్గా, వంట మనిషిగా పని చేసేవాడు. భార్యాభర్తలకు ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవి.
కాగా పెళ్లైన మూడేళ్లకే మహ్మద్ ఫైజ్ ఖురేషి భార్యకు తలాక్ ఇచ్చాడు. ఈ క్రమంలో వారికి పెద్దలు నచ్చజెప్పి మళ్లీ రెండేళ్ల క్రితం మరోసారి నిఖా చేసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఈనెల 6వ తేదీ ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె సోదరులు ఈనెల 11న భర్త ఇంట్లో వదిలి వెళ్లాడు. అదే సమయంలో అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆమె అత్త ఖమర్‌బేగం సోదరుడికి ఫోన్ చేసి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పింది. వెంటనే ఆమె సోదరులు ఇంటికి వచ్చాడు.
గొంతు, కడుపుపై గాయాలు : అగ్నిప్రమాదంలో ఖమర్‌బేగం చనిపోయిందని ఆమె అత్త, భర్త చెప్పారు. దీంతో ఇంటి లోపలికి వెళ్లిన సోదరులిద్దరికి అనుమానం వచ్చింది. కాలిపోయిన స్థితిలో ఉన్న సోదరి గొంతు, కడుపుపై గాయాలున్నాయి. మంచంపై రక్తం కనిపించడంతో వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అత్త, భర్తను అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో దాచిన కత్తి స్వాధీనం చేసుకున్నారు. తన భార్య ఖమర్‌బేగంకు వివాహేతర బంధం ఉందని, మానుకోవాలని చెప్పినా వినకపోవడంతోనే హత్య చేశానని పోలీసులకు ఫైజ్ ఖురేషి తెలిపాడు. బావ వివాహేతర బంధానికి తన సోదరి అడ్డుగా ఉందని భావించి హత్య చేశాడని బావమరిది పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వివాహేతర సంబంధం అడ్డుపెట్టుకుని మహిళ బ్లాక్ మెయిల్ - వేధింపులు భరించలేక హత్య
వివాహేతర సంబంధం - మంచం కింద డిటోనేటర్లు పేల్చి వీఆర్ఏ హత్య - VRA Murder With Detonators in AP