ETV Bharat / state

పునరావాసమా? అరణ్యవాసమా? - పోలవరం నిర్వాసితులకు జగన్​ శాపం - కూటమి ప్రభుత్వం కన్నీళ్లు తుడిచేనా! - POLAVARAM RESIDENTS COMPENSATION

ఓ ప్రణాళికంటూ లేకుండా పోలవరం నిర్వాసితుల్ని నట్టేట ముంచిన గత ప్రభుత్వం

POLAVARAM_RESIDENTS_COMPENSATION
POLAVARAM_RESIDENTS_COMPENSATION (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 9, 2024, 2:55 PM IST

Polavaram Residents Compensation Problems in AP : వాళ్లు ఒకప్పుడు బాగా బతికిన వాళ్లే! మంచి ఇళ్లు! పొలాలు! ఆస్తులు. ఇలా దేనికీ లోటులేదు! కానీ గత ప్రభుత్వ పాపాలు వారికి శాపాలయ్యాయి. ఇదిగో పరిహారం, అదిగో పునరావాసం అంటూ ఆశపెట్టారు. తీరా అక్కడికెళ్తే మొండిగోడలు. పిచ్చిచెట్లు తప్ప ఏమీలేవు. అన్నీ వదులుకుని అరణ్యవాసం చేస్తున్నారు. ఆ అభాగ్యులు ఎవరోకాదు ఏపీ జీవనాడి కోసం సర్వం త్యాగం చేసిన పోలవరం నిర్వాసితులు! నాడు జగన్‌ మాటలు నమ్మి నిండా మునిగిన నిర్వాసితులు. నేడు కూటమి ప్రభుత్వంపైనే కొండంత ఆశలు పెట్టుకున్నారు.

నిర్వాసితుల్ని నట్టేట ముంచిన గత ప్రభుత్వం : 2021 గోదావరి వరదల సమయంలో పోలవరంప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌ దేవీపట్నం మండలాన్ని ముంచెత్తాయి. ముంపు గ్రామాల ప్రజలు కట్టుబట్టలతో మైదాన ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఏడాదిలోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని, ఆర్ అండ్ ఆర్​ ప్యాకేజీ కూడా ఇస్తామంటూ నాటి పాలకులు, అధికారులు నమ్మబలికారు. దేవీపట్నం, పూడిపల్లిలోని గిరిజనేతరుల పునరావాసం కోసం గోకవరంలో 75 ఎకరాలు సేకరించారు. అందులో పూడిపల్లి వాసుల కోసం 20 ఎకరాల్లో చేపట్టిన ఇళ్లివి. ఇక్కడ 74 మందికి గృహాలు మంజూరు చేశారు. హామీలిచ్చినంత వేగంగా గత పాలకులు నివాసాలు పూర్తిచేయలేదు. బయట అద్దెలు కట్టుకోలేక తలుపులు, కిటికీల్లేని ఇళ్లలోనే నిర్వాసితులు తలదాచుకుంటున్నారు. కొందరైతే సొంత డబ్బుతో ఇళ్లు కట్టుకున్నారు. కానీ గత ప్రభుత్వం వారికి బిల్లులూ చెల్లించలేదు.

"రూ.2,800 కోట్లు తీసుకోండి" - పోలవరం పనులకు తొలిసారిగా అడ్వాన్స్ ఇచ్చిన కేంద్రం

తలుపులు లేని ఇళ్లలోనే నివాసం : ఇక దేవీపట్నం వాసులకు కేటాయించి పునరావాస కాలనీ మరింత అధ్వానం. ఇక్కడ 55 ఎకరాల్లో ఒక్కొక్కరికీ ఐదు సెంట్ల చొప్పున 430 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అవన్నీ అసంపూర్తిగానే వదిలేశారు. నడవడానికి రోడ్డు, తాగడానికి నీళ్లు ఇలాంటి కనీస సదుపాయాలేవీ ఇక్కడలేవు. బయట అద్దెలు కట్టుకోలేకపోతున్నాం,కనీసం కరెంటైనా ఇస్తే ఈ మొండిగోడల మధ్యే తలదాచుకుంటామని అధికారులకు ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది.

అధికారుల తప్పిదాలు - పోలవరం నిర్వాసితుల జీవితాల్లో తొలగని కష్టాలు - POLAVARAM COMPENSATION problems

కరెంటు ఇవ్వని గత ప్రభుత్వం : ఇక్కడ 8 ఎకరాలమేర వివాదాస్పద భూముల్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వాసితులకు పట్టాలుగా పంచి ఇచ్చేసింది. ఫలితంగా మూడున్నరేళ్లైనా వాటిలో పనులు ప్రారంభించలేని పరిస్థితి. గోదావరి కన్నా జగనే తమను ఎక్కువ ముంచేశారనే బాధ నిర్వాసితుల్లో కనిపిస్తోంది. గత శుక్రవారం పునరావాస కాలనీల సందర్శనకు వచ్చిన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓ అతుల్ జైన్‌తోపాటు రంపచోడవరం అధికారుల్ని నిర్వాసితులు అడ్డుకున్నారు. కూటమి ప్రభుత్వమైనా తమ కన్నీళ్లు తుడవాలని ఎదురుచూస్తున్నారు.

"పోలవరం కోసం సర్వం త్యాగం చేశాం- 20 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్నాం" - Polavaram Residents Problems

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.