ETV Bharat / state

₹29,395 కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం- జాతికి అంకితం చేసిన మోదీ

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 11, 2024, 7:14 PM IST

Updated : Mar 11, 2024, 8:38 PM IST

PM Modi Inaugurates 114 National Highway Projects: దేశవ్యాప్తంగా లక్ష కోట్ల రూపాయల విలువైన 114 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు హరియాణాలోని గురుగ్రామ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రాష్ట్రంలోనే 29 వేల 395 కోట్లతో 1134 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టగా, ఇప్పటికే పూర్తైన 6 జాతీ రహదారులను జాతికి అంకితం చేశారు. 12 జాతీయ రహదారుల పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.

M_Modi_Inaugurates_114_National_ Highway_Projects

PM Modi Inaugurates 114 National Highway Projects : దేశవ్యాప్తంగా లక్ష కోట్ల రూపాయల విలువైన 114 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు హరియాణాలోని గురుగ్రామ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి బీజీపీ నేతలు, మంత్రులు, అధికారులు వర్చువల్​గా కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోనే 29 వేల 395 కోట్లతో 1134 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టగా, ఇప్పటికే పూర్తైన 6 జాతీ రహదారులను జాతికి అంకితం చేశారు. 12 జాతీయ రహదారుల పనులను ప్రధాని శంకుస్థాపన చేశారు. విజయవాడ లోని నువాటెల్ హోటల్​లో కార్యక్రమంలో పాల్గొన్న ఎన్​హెచ్​ఏఐ ఉన్నతాధికారులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, బీజేపీ నేతలు పాల్గొన్నారు.

Modi Inaugurates National Highway : ఆంధ్రప్రదేశ్‌లో 2 వేల 950 కోట్ల రూపాయలతో నిర్మించిన ఆనందపురం-పెందుర్తి-అనకాపల్లి జాతీయ రహదారి, ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలోని హరియాణా సెక్షన్‌, 4 వేల 600 కోట్లతో నిర్మించిన లఖ్‌నవూ రింగ్‌ రోడ్‌, జాతీయ రహదారి 21లో భాగంగా 3 వేల 400 కోట్ల రూపాయలతో హిమాచల్‌ ప్రదేశ్‌లో నిర్మించిన కిరాత్‌పూర్- నెర్‌చౌక్ సెక్షన్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లో 20 వేల 500 కోట్ల రూపాయల విలువైన 42 ప్రాజెక్టులను మోదీ ఆరంభించారు.

అంతేకాకుండా జాతీయ రహదారులకు సంబంధించిన పలు ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. ఇందులో 14 వేల కోట్ల రూపాయలతో నిర్మించనున్న బెంగళూర్‌-కడప-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే కూడా ఉంది. ఇది కాకుండా వివిధ రాష్ట్రాల్లో వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అనేక జాతీయ రహదారుల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. దేశంలో లక్షల కోట్లరూపాయల అభివృద్ధి పనులు చూసి వారికి నిద్ర పట్టడం లేదని అన్నారు.

జాతీయ రహదారి విస్తరణలో జాప్యం - కొన్నిచోట్ల కిలోమీటర్‌ కూడా పూర్తి చేయని కాంట్రాక్టర్లు

గడచిన పదేళ్లలో ఏపీలో 70వేల కోట్లతో జాతీయ హైవే పనులు చేపట్టడం సంతోషకరమని పురంధేశ్వరి తెలిపారు. 2040 కల్లా అభివృద్ది చెందిన వికసిత్ భారత్​ను చూడాలన్నది మోదీ కలని తెలిపారు. గతంలో ప్రపంచంలో భారత్ ఆర్థికంగా 11వ స్థానంలో ఉండగా, మోదీ ప్రధాని అయ్యాక భారత్ ఆర్థికంగా 5వ స్థానానికి చేరిందన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగుతోందన్నారు. రానున్న రోజుల్లో ఆర్థికంగా భారతదేశం 3వ స్థానానికి చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఏపీలో రూ. 613 కోట్లతో రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు

"దేశవ్యాప్తంగా లక్షల కోట్ల వ్యయంతో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి కాంగ్రెస్‌, దాని అహంకార కూటమి అతిపెద్ద సమస్య ఎదుర్కొంటోంది. వారికి నిద్రకూడా పట్టడం లేదు. ఇంత వేగంగా అభివృద్ధి పనులు జరుగుతాయా అని వారికి అర్థం కావడం లేదు. అందుకే అభివృద్ధి పనులపై చర్చ జరిపేందుకు వారికి ధైర్యం చాలడం లేదు. మోదీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేపట్టారని విపక్షాలు అంటున్నాయి. పదేళ్లలో దేశం ఎంతో మారిపోయింది. కానీ కాంగ్రెస్‌, వారి మిత్రపక్షాల కళ్ల అద్దాలు మాత్రం మారలేదు. వారి కళ్ల అద్దాల సంఖ్య ఇప్పటికీ అదే. అంతా వ్యతిరేకించడం."- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

మంగళగిరి ఎయిమ్స్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన మోదీ

Last Updated : Mar 11, 2024, 8:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.