ETV Bharat / state

ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి చంద్రబాబు అనుభవం ఎంతో దోహదపడుతూ వచ్చింది : మోదీ - PM Modi Birthday Wishes to CBN

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 20, 2024, 7:01 PM IST

PM Modi Birthday Wishes to Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి చంద్రబాబు అనుభవం ఎంతో దోహదపడుతూ వచ్చిందని ప్రధాని మోదీ కొనియాడారు. చంద్రబాబు పుట్టినరోజు వేళ శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్‌ చేసిన ఆయన ప్రజలకు మరింత సేవ చేసేందుకు భగవంతుడు చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకుంటున్నట్లు పేర్కొన్నారు.

pm_modi_birthday_wishes_to_chandrababu_naidu

ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి చంద్రబాబు అనుభవం ఎంతో దోహదపడుతూ వచ్చింది : మోదీ

PM Modi Birthday Wishes to Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి చంద్రబాబు అనుభవం ఎంతో దోహదపడుతూ వచ్చిందని ప్రధాని మోదీ కొనియాడారు. చంద్రబాబు పుట్టినరోజు వేళ శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్‌ చేసిన ఆయన ప్రజలకు మరింత సేవ చేసేందుకు భగవంతుడు చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకుంటున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్ రాజకీయంగా, పరిపాలనాపరంగా అనుభవజ్ఞులైన ఆయన నిరంతం రాష్ట్రం గురించే ఆలోచన చేస్తారన్నారు. వైసీపీ పెట్టిన కేసులతో జైల్లో ఉన్నప్పుడూ ఆయన మనో నిబ్బరం కోల్పోలేదని గుర్తు చేశారు. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సంతోషాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.

పండుగలా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు- పాల్గొన్న భువనేశ్వరి, బాలకృష్ణ, బ్రాహ్మణి - CHANDRABABU BIRTHDAY CELEBRATIONS

Chandrababu Naidu Thanks To Modi : తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనుభవజ్ఞుడైన నాయకుడు, నిరంతం ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి అంకితమైన నేత అని సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా కొనియాడారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీకి చంద్రబాబు కృతజ్ఞతలు తెలుపుతూ రీ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసే విషయంలో తాను అంకితభావంతో ఎప్పటికీ కట్టుబడి ఉన్నానని తెలిపారు.

CBN Birthday Celebrations in Two Telugu States : రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అనంతపురం జిల్లా కణేకల్లు క్రాస్ లోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులతో కలసి చంద్రబాబు జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు పలికారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ తన ఇంటి వద్ద అభిమానులతో కలసి కేక్ కట్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషిని గుర్తు చేశారు.

16 వేల 676 అడుగుల ఎత్తులో - చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు - Chandrababu Birthday Wishes

గుంటూరులో టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు, భువనేశ్వరిల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఒంగోలులో ఎన్నికల పార్టీ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కేక్ కోసి కార్యకర్తలకు పంచారు. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎన్టీఆర్ భవన్ లో ఉత్సవాలు జరిపారు. 74 కేజీల భారీ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.