ETV Bharat / state

నిర్లక్ష్యపు డ్రైవింగ్​తో ఏపీలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు - చర్యలు శూన్యం - road accidents in Andhra Pradesh

Peoples Died in Road Accidents in AP : రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరి నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల అమాయకపు ప్రాణాలు బలౌతున్నాయి. రోడ్డు ప్రమాదాలపై కేెంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన చర్యలు చేపట్టాకపోవటం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు.

Peoples_Died_in_Road_Accidents_in_AP
Peoples_Died_in_Road_Accidents_in_AP
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 10, 2024, 7:20 PM IST

నిర్లక్ష్యపు డ్రైవింగ్​తో ఏపీలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు - చర్యలు శూన్యం

Peoples Died in Road Accidents in AP : రాష్ట్రంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతునే ఉన్నాయి. కొందరి నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల అమాయకపు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని అమరావతి - అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మినీ లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతుడు గిద్దలూరుకు చెందిన దూదేకుల ఖాదర్​వలీగా పోలీసులు గుర్తించారు. మొదట తీవ్రంగా గాయపడ్డ దూదేకుల ఖాదర్​వలిని కుటుంబ సభ్యులు గిద్దలూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని గిద్దలూరు అర్బన్ సీఐ సోమయ్య వెల్లడించారు.

ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరో వాహనం - ముగ్గురు మృతి - శబరిమల వెళ్తున్న బస్సు ఢీకొని ఒకరు

Road Accidents In Andhra Pradesh : బాపట్ల జిల్లా శింగరకొండ మలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి వెళ్తున్న కారు శింగరకొండ మలుపు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు కావలి మండలం జలదంకి గ్రామానికి శ్రావణ్ కుమార్​గా పోలీసులు గుర్తించారు. అనంతరం శ్రావణ్ మృతి గురించి వారి బంధువులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

బైపాస్ కాబట్టి సరిపోయింది! ఆ లారీ పట్టణంలోకి వస్తే? - మద్యం మత్తులో స్టీరింగ్​పై పడిపోయిన డ్రైవర్

Road Accidents in India 2024 : నెల్లూరు జిల్లా కావలి ముసునూరు టోల్‌ప్లాజా వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీలు, ప్రైవేటు బస్సు ఢీకొన్న ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. ప్రమాదంలో సుమారు 15 మందికి గాయాలయ్యాయి. ఈరోజు(శనివారం) తెల్లవారుజామున సుమారు 2 గంటల 20 నిమిషాల సమయంలో ముసునూరు టోల్‌ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీని మరో లారీ వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆగి ఉన్న లారీ పడిపోయింది.

వెనుక నుంచి వేగంగా ఢీకొట్టిన లారీ నియంత్రణ కోల్పోయి డివైడర్‌ అవతలివైపు వస్తున్న ప్రైవేటు బస్సును కూడా ఎదురుగా ఢీకొట్టింది. ప్రమాదంలో ప్రైవేటు బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయింది. ఈ దుర్ఘటనలో రెండు లారీలు, బస్సులోని మొత్తం ఆరుగురు ప్రయాణికులు మృతిచెందారు. మరో 15 మందికి తీవ్రగాయాలు కాగా వారిని వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

స్టీరింగ్ రాడ్ విరిగిపోయి పంటకాల్వలో స్కూల్ బస్ పల్టీ - విద్యార్థులు సేఫ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.