ETV Bharat / state

ఆ 13 కిలో మీటర్ల దూరం ప్రయాణం ప్రాణాలకే ప్రమాదం - DAMAGED ROADS IN KAKINADA

ఏలేశ్వరం నుంచి జెడ్డంగి అన్నవరం వరకు అధ్వానంగా రహదారి - అడుగుకో గుంతతో వాహదారులకు తప్పని అవస్థలు

DAMAGED_ROADS_IN_KAKINADA
DAMAGED_ROADS_IN_KAKINADA (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 19, 2024, 10:38 AM IST

People Suffering Due to Damaged Roads in Kakinada District : మైదాన ప్రాంతం నుంచి మన్యంలోని ఊళ్లను కలిపే కీలక రహదారి అది. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు ఈ రోడ్డుపై రాకపోకలు సాగిస్తాయి. అలాంటి దారిలో భారీ గుంతలు, రాళ్లు తేలిన పరిస్థితులు ప్రయాణాన్ని నరకప్రాయంగా మార్చాయి. పాము మెలికలుగా సాగే ప్రయాణంలో రెప్ప వాలిస్తే ఇక అంతే. వాహనం బోర్లా పడాల్సిందే. వాహనదారులకు అగ్ని పరీక్ష పెడుతున్న ఈ రహదారికి గత వైఎస్సార్సీపీ పాలనలో కనీస మరమ్మతులు చేయలేదు. దీంతో వైఎస్సార్సీపీ పాలనా పాపం ప్రయాణికులకు నిత్యం శాపంగా మారింది.

అధ్వానంగా రహదారి : కాకినాడ జిల్లా ఏలేశ్వరం నుంచి మన్యంలోని అడ్డతీగల, రాజవొమ్మంగి, వై.రామవరంతో పాటు విశాఖ జిల్లా నర్సీపట్నం వెళ్లే ఈ రహదారి దారుణంగా దెబ్బతింది. ఏలేశ్వరం నుంచి జెడ్డంగి అన్నవరం వరకు 13 కిలోమీటర్ల దారిలో వాహనాలు నడపడం అంటే సర్కస్ ఫీట్లు చేసినట్లే. ఏలేశ్వరం నుంచి రమణయ్యపేట వరకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రోడ్డు వేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ పాలకులు నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారు. ఫలితంగా రహదారి పూర్తిగా ధ్వంసమైంది. రమణయ్యపేట నుంచి మన్యంలోని అడ్డతీగల మండలం గుంటువానిపాలెం మధ్య రహదారి తీవ్రంగా దెబ్బతిని ప్రయాణికులకు నరకం చూపిస్తోంది.

ఖైదీలకైనా ఇలాంటి శిక్ష ఉండదేమో! - ఆ రోడ్డుపై 10 కిలోమీటర్ల ప్రయాణం దారుణం

భారీ లారీల పాత్ర : ఏలేశ్వరం-రాజవొమ్మంగి-నర్సీపట్నం రహదారి ఇంతలా ధ్వంసమవ్వడంలో భారీ లారీల పాత్ర ఉందని స్థానిక ప్రజలు అంటున్నారు. ఏలేశ్వరం మండలం కొండల్లో తవ్వేసిన బండరాళ్లను భారీ లారీల్లో తరలిస్తుంటారు. ఈ రోడ్డు పైనే ప్రయాణించి బయట ప్రాంతాలకు లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో రహదారి తీవ్రంగా ధ్వంసమైంది.

గతపాలకుల నిర్లక్ష్యం - అస్తవ్యస్తంగా గ్రామీణ రోడ్లు - Damaged Roads in prakasam

వాహదారులకు తప్పని అవస్థలు : ఏజెన్సీ నుంచి ఏలేశ్వరం మీదుగా కాకినాడ, రాజమహేంద్రవరం, ఉమ్మడి విశాఖ జిల్లా వైపు వెళ్లే మన్యం వాసులు నిత్యం ఈ రోడ్డుపైనే రాకపోకలు సాగిస్తుంటారు. భారీ గుంతలతో, రాళ్లు తేలిపోయిన ఈ రహదారిపై ప్రయాణించాలంటే మహిళలు బెంబేలెత్తుతున్నారు. లోతైన గుంతలతో కూడిన రహదారిలో ప్రయాణం కష్టంగా ఉందని, వర్షం పడితే ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారుతోందని ప్రయాణికులు అంటున్నారు. రమణయ్యపేట నుంచి రహదారి దుస్థితిని ఆర్​ అండ్ బీ అధికారులు ఇటీవల పరిశీలించారు. ఈ రహదారి నిర్మాణం చేపట్టాలని గుత్తేదారుని సంప్రదించారు.

రోడ్డంతా చేపల మయం - అమ్మేది లేదు, కొనేది లేదు - దొరికినోళ్లకు దొరికినన్ని - Fish Fell on the Road

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.