People Facing Problems with Poor Drainage System: ఆ కాలనీలో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. దానికి కారణం దొంగతనాలో, దోపిడీలో అని భావిస్తే పొరపాటే. ఆ ప్రాంత ప్రజల ఇళ్లను మురుగు నీళ్లు చుట్టుముట్టాయి. దీంతో బయటకు రావాలంటేనే ఆ ప్రాంత ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ పరిస్థితి ఏదో ఒక్క కాలనీకే పరిమితం కాదు. చుట్టుపక్కల కాలనీలు సైతం ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నాయి. తమ ప్రాంత మురుగు కాలువల సమస్యను అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా వారి నుంచి ఎటువంటి స్పంధన రావడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ మురుగు తమ ఇంటిని చుట్టిముట్టేయడంతో పెద్ద సంఖ్యలో దోమలు, ఈగలు చేరి అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొటున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వీఎంసీ ఓపెన్ డ్రైనేజీలో పడి ఆటోడ్రైవర్ మృతి - మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని సీపీఎం డిమాండ్
కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని కానూరు, సనత్ నగర్, తులసీ నగర్, కృష్ణానగర్ వంటి ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు మురుగు వాసనతో అల్లాడిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. వారి ఇళ్లను మురుగు నీళ్లు చుట్టిముట్టేయడంతో నానా అవస్థలు పడుతున్నారు. నెలల తరబడి మురుగు పారకపోవడంతో విపరీతమైన దుర్వాసన వస్తోంది. మురుగు నీరు రోడ్లపై వర్షలు నీరులా ప్రవహిస్తోంది. దీంతో ఈ రహదారుల్లో రాకపోకలు సాగించాలంటే స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ముంచెత్తుతున్న మురుగు, ఓపెన్ నాలాలు- మహానగరంలో కాలనీల పరిస్థితి ఇది
విజయవాడ ఆటోనగర్ నుంచి సనత్ నగర్ వైపు వెళ్లే రహదారి పొడవన మురుగునీటిలో చెత్తాచెదారం విపరీతంగా చేరింది. దీంతో ఈ రహదారి పొడవున విపరీతమైన దుర్వాసన వస్తోంది. ఈ రోడ్డులో నడవాలన్నా, రాకపోకలు సాగించాలన్నా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మరికొన్ని కాలనీల్లో రోడ్ల నిర్మాణ పనులు అర్థాంతరంగా ఆగిపోయాయి. దీంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని స్థానికులు చెబుతున్నారు. తమకు మురుగు సమస్య నుంచి విముక్తి కలిగించాలని అనేక సార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రాణాలు తీస్తున్నా మొద్దు నిద్ర వీడని అధికారులు - అధ్వానంగా విజయవాడ డ్రైనేజీ వ్యవస్థ
మురుగు నెలల తరబడి నిల్వ ఉండడంతో దుర్వాసనతో పాటు దోమలు, ఈగల బెడద విపరీతంగా స్థానికులు వాపోతున్నారు. సాయంత్రం 4 గంటల తరువాత ఈ ప్రాంత ప్రజలపై దోమలు దండయాత్ర చేస్తున్నాయని అంటున్నారు. మురుగు కాలువలపై ఎటువంటి మూతలు లేకపోవడంతో గతంలో అనేక ప్రమాదాలు జరిగాయని చెబుతున్నారు. తమ పిల్లలు మురుగు కాలువల్లో పడి ప్రాణాపాయ పరిస్థితుల్లోకి చేరుకున్న ఘటనలు గతంలో జరిగాయని స్థానికులు చెబుతున్నారు.
పాఠశాలకు వెళ్లే విద్యార్థులు రాకపోకలు సాగించే సమయంలో నరకం చూస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగు వాసన విపరీతంగా వెదజల్లడంతో ఇంటిల్లోనూ ఉండలేని పరిస్థితులు దాపురిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. వేసవి కాలంలోనే ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎదుర్కొవలసి వస్తోందని వర్షాకాలంలో అయితే డ్రైనేజీల్లో పారాల్సిన మురుగు నీళ్లు తమ ఇంటిల్లోకి వస్తున్నాయని వాపోతున్నారు.