ETV Bharat / state

రోజురోజుకూ పెరుగుతున్న కొండ- నెల్లూరు నగర వాసులను వేధిస్తున్న చెత్త సమస్య - Problems With Dumping Yard

People Face Problems With Dumping Yard at Nellore : నెల్లూరు నగరం చెత్త కంపు కొడుతోంది. వైఎస్సార్సీపీ సర్కార్‌ అసమర్థ విధానాల ఫలితాల్ని నగరవాసులు అనుభవిస్తున్నారు. డంపింగ్‌ యార్డులో వ్యర్థాలు కొండలా పేరుకుపోతున్నా కనీసం అటువైపు కన్నెత్తి చూసే నాథుడేలేడు. ముక్కుపిండి మరీ చెత్తపన్ను వసూలు చేస్తున్న నెల్లూరు నగరపాలక సంస్థ పారిశుద్ధ్య నిర్వహణను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

people_face_problems_with_dumping_yard_at_nellore

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 13, 2024, 5:03 PM IST

People Face Problems With Dumping Yard at Nellore : నెల్లూరు నగరం చెత్త కంపు కొడుతోంది. వైఎస్సార్సీపీ సర్కార్‌ అసమర్థ విధానాల ఫలితాల్ని నగరవాసులు అనుభవిస్తున్నారు. డంపింగ్‌ యార్డులో వ్యర్థాలు కొండలా పేరుకుపోతున్నా కనీసం అటువైపు కన్నెత్తి చూసే నాథుడేలేడు. వీధుల్లో ఎక్కడ చూసినా వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. చెత్త నుంచి సంపద సృష్టించేలా తెలుగుదేశం ప్రభుత్వం అమలుచేసిన ప్రణాళికల్ని జగన్ ప్రభుత్వం చెత్త బుట్టలో పడేసింది.

స్వచ్ఛతకు ఆమడదూరంలో నెల్లూరు కార్పొరేషన్​.. ప్రజలకు తప్పని తిప్పలు

Dumping Yard Creates Several Problems to Nellore Residents : నెల్లూరు నగర పరిధిలో 9లక్షల మంది నివసిస్తున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో అస్తవ్యస్తంగా మారిన పారిశుద్ధ్య నిర్వహణతో వీరంతా తీవ్ర అవస్థలు పడుతున్నారు. 54డివిజన్లలో రోజూ 350 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా చెత్త సేకరణ కోసం ఏటా వాహనాల నిర్వహణ కోసం 3కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ బాధ్యతను గుత్తేదారులకు అప్పగించడంతో మొక్కుబడిగా నిర్వహణ కొనసాగుతోంది. ఫలితంగా ఆత్మకూరు బస్టాండ్, మినీబైపాస్ రోడ్డు, మాగుంట లేఅవుట్, పొదలకూరు రోడ్డు, అయ్యప్పగుడి వరకు వేలాది దుకాణాల ముందు చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. మురుగు కాలువల్లో వ్యర్థాలు నిండి దుర్గంధం వెదజల్లుతున్నాయి.

'నెల్లూరు నగరాన్ని డంపింగ్‌యార్డు సమస్య వేధిస్తోంది. శుద్ధి చేయకుండానే ఐదేళ్లుగా చెత్త తరలించడంతో దొంతాలి వద్ద 13వేల మెట్రిక్ టన్నుల కొండలా తయారైంది. బోడిగాడి తోటలో ఇళ్ల మధ్యలో ఏర్పాటు చేసిన ఉప డంపింగ్‌ యార్డ్‌ను అల్లిపురానికి మార్చారు. ఐదేళ్లలో భూసేకరణ చేసి డంపింగ్‌ యార్డు సమస్య తీర్చేందుకు జగన్‌ సర్కార్‌ చిత్తశుద్ధితో పని చేసిందే లేదు. ఫలితంగా దొంతాలి డంపింగ్‌ యార్డుతో సమీప గ్రామాల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. చెత్త తగలపెట్టకూడదనే న్యాయస్థానం ఆదేశాలనూ కార్పొరేషన్‌ అధికారులు బేఖాతరు చేస్తున్నారు.' - స్థానికులు

DUMP YARD: చెత్త పన్ను చెల్లించలేదని... అక్కడ అంతపని చేశారట

Dumping Yard Problems : నెల్లూరు నగరాన్ని పారిశుద్ధ్యంలో మేటిగా తీర్చిదిద్దుతామని గొప్పలు చెప్పిన వైఎస్సార్సీపీ సర్కార్‌ ఐదేళ్లలో పూర్తిగా విఫలమైంది. చెత్తను శుద్దిచేసి ఎరువును రైతులకు విక్రయించి కార్పొరేషన్‌కు ఆదాయం తెచ్చే ప్రణాళికల్ని గత తెలుగుదేశం ప్రభుత్వం అమలుచేసింది. కానీ జగన్‌ ప్రభుత్వం వీటిని అటకెక్కించింది. చెత్తశుద్ధి కేంద్రాల్ని నిరుపయోగంగా మార్చేసింది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిన పారిశుద్ధ్య సాంకేతిక వాహనాలను మూలన పడేసింది. ముక్కుపిండి మరీ చెత్తపన్ను వసూలు చేస్తున్న నెల్లూరు నగరపాలక సంస్థ పారిశుద్ధ్య నిర్వహణను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కడపలో డంపింగ్ యార్డు వివాదం.. ప్రజల ఆగ్రహం

ఇది కొండ అనుకుంటారేమో.. కానే కాదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.