ETV Bharat / state

"గ్రాము బంగారమైనా కొనాల్సిందే!" - దుకాణాలకు ఎగబడుతున్న ప్రజలు - GOLD PURCHASE ON DHANA TRAYODASHI

ధనత్రయోదశి సందర్భంగా బంగారం దుకాణాల కిటకిట - పసిడి, వెండి ఆభరణాలు కొనేందుకు ప్రజల ఆసక్తి

Etv Bharatbuying_gold_on_dhana_trayodashi
Etv Bharatbuying_gold_on_dhana_trayodashi (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 29, 2024, 6:57 PM IST

Updated : Oct 29, 2024, 7:12 PM IST

Crowd at Gold Shops on the Occasion of Dhanteras: పండుగలు, శుభకార్యాల సమయంలో బంగారం కొనుగోలు చేయడం భారతీయులకు అలవాటు. ధన త్రయోదశి వంటి మంచి రోజుల్లో పసిడి కొనుగోలు చేయడాన్ని శుభప్రదంగా భావిస్తారు. ఆ రోజు బంగారం కొనుగోలు చేసి లక్ష్మీదేవికి పూజలు చేస్తే సిరిసంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం. ధన త్రయోదశిని పురస్కరించుకొని పుత్తడిని కొనుగోలు చేసేందుకు విజయవాడలోని ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. వారి కోసం ఇప్పటికే పలు బంగారు ఆభరణ దుకాణాల వ్యాపారస్ధులు పలు ఆఫర్లతో ఆకర్షిస్తున్నారు.

దీపావళి అమావాస్యకు 2 రోజుల ముందు వచ్చే త్రయోదశిని ధన త్రయోదశిగా చెబుతుంటారు. దీనినే ధన్ తేరాస్ అంటారు. ధన త్రయోదశికి పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేవదానవులు అమృతం కోసం మథిస్తున్న పాల కడలి నుంచి లక్ష్మీదేవి ఉద్భవించిందంటారు. ఆమెను భార్యగా స్వీకరించిన శ్రీమహావిష్ణువు 'ఐశ్వర్యానికి అధిదేవత'గా ప్రకటించాడని పురాణ గాథలు చెబుతున్నాయి. ఇది ఆశ్వయుజ బహుళ త్రయోదశి.

ఈ రోజున ధనాధి దేవత లక్ష్మీదేవి జన్మదినోత్సవంగా భావించి పూజించడం వల్ల విశేష ఫలితం ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతటి మహత్తరమైన రోజున బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేసి లక్ష్మీదేవిని పూజిస్తే మరింత కలిసి వస్తుందనేది నమ్మకం. పెద్దమొత్తంలో బంగారం కొనలేకపోయినా ఒక్క గ్రామైనా బంగారమైన కొనేందుకు ప్రజలు మొగ్గు చూపుతారు.

దీపావళికి గోల్డ్ బిజినెస్‌ రూ.30వేల కోట్లు - భవిష్యత్‌లో బంగారం కంటే వెండికి భారీ డిమాండ్‌!

ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ భౌగోళిక రాజకీయ, ఆర్థిక అస్థిరత నెలకొన్నా బంగారంలో పెట్టుబడే సురక్షితంగా భావిస్తారు. అందుకే అది పెరగడమే కానీ తరగడం లేదు. గత కొన్నేళ్లుగా పసిడి ధర పెరుగుతూనే ఉంది. గత ఎడాది 22 క్యారెట్ల బంగారం తులం రూ.65 వేల వరకు ఉండగా ప్రస్తుతం రూ.73 వేలకు చేరింది. 2 నెలల్లో దాదాపు 18 శుభ ముహుర్తాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాలకు ఎలాగూ పుత్తడి కొనాలనుకునేవారు సైతం ఈ రోజే తీసుకుంటారు. మరికొందరు నాణేలు, బిస్కెట్ల రూపంలో బంగారం, వెండి కొనుగోలు చేస్తారు. ఈ సెంటిమెంటు వల్లే ధన త్రయోదశి సమయంలో విక్రయాలు సాధారణంగా అధికంగా ఉంటాయి. డిమాండ్​కు దృష్టిలో పెట్టుకొని వివిధ రకాల డిజైన్లను వర్తకులు అందుబాటులోకి తెచ్చారు.

గోల్డ్ VS డైమండ్- ఇన్వెస్ట్ చేసేందుకు ఏది బెటర్? ఎందులో రిస్క్ తక్కువ?

'పది లక్షలకే కిలో బంగారం - డబ్బులు అవసరమై అమ్మేస్తున్నా'

Last Updated : Oct 29, 2024, 7:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.