ETV Bharat / state

మా ఊరికి ఆ పేరేంటి - జగన్​ ఫొటోలు తొలగించిన యువకులు - JaganMohanapuram Name Board Destroy

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 26, 2024, 10:55 AM IST

People Angry With Jagan For Village Name Change: జగన్​ పాలనలో ఊరి పేరుని మార్చేసి జగన్మోహనపురం అని పెట్టిన బోర్డును కొందరు యువకులు తొలగించేశారు. మా ఊరి పేరుకి ఆయన పేరు పెట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జన్మోహనపురం బోర్డుని తొలగించేసి జనసేన జెండాను ఆ యువకులు ఎగరేశారు.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

People Angry With Jagan For Village Name Change: జగన్​ పరిపాలనలో కొందరు వైఎస్సార్సీపీ వాళ్లు ఓ ఊరి పేరునే మార్చేశారు. అదేమిటి అని అడిగితే బెదిరింపులకు గురి చేశారు. వైఎస్సార్సీపీ నేతల బెదిరింపులకు లోనైన వారు ప్రభుత్వం మారడంతో కొండంత ధైర్యం వచ్చిందని అంటున్నారు. జగన్​ భక్తితో పరవశించిపోయి అప్పట్లో పోలవరం అనే ఊరి పేరుని మార్చేసి ఎకంగా జగన్మోహనపురం అని పెట్టేశారు. దానిని ఇప్పుడు కొందరు యువకులు తొలగించేశారు. ఇది ఎక్కడ జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మా ఊరు పోలవరం. మా గ్రామానికి వెళ్లే మార్గంలో భారీ ఆర్చి కట్టి జగన్మోహనపురం అని పేరు పెట్టారు. ఇన్నాళ్లూ అభ్యంతరం చెబితే వైఎస్సార్సీపీ వారు బెదిరించారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది నిగ్గదీసే ధైర్యం వచ్చింది అంటూ కొందరు యువత సంఘటితమై ఆర్చి ఎక్కి జగన్‌ చిత్రాలు తొలగించారు. ఇది కాకినాడ గ్రామీణ మండలం పోలవరంలో చోటు చేసుకుంది.

ఆక్రమించిన స్థలంలో వైకా'ప్యాలెస్​లు' - అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితుల ఆవేదన - Notice to YSRCP Office in Peddapadu

తమ్మవరం పంచాయతీలోని పోలవరం గ్రామానికి వెళ్లే మార్గంలో ఓ పక్కన నేమాం లే అవుట్‌ జగనన్న కాలనీ ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా కాలనీల్లో ఆర్చిలు, పైలాన్లతో హడావుడి చేసిన విషయం తెలిసిందే. 2020 డిసెంబర్‌ 25న యు. కొత్తపల్లి మండలం కొమరగిరి లేఅవుట్‌లో రాష్ట్ర వ్యాప్త ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్న అప్పటి సీఎం జగన్‌ను ఆకర్షించేందుకు మార్గమధ్యలోని ఈ పోలవరం గ్రామం వద్ద భారీ ఆర్చి నిర్మించారు. దానికి జగన్మోహనపురం పేరు పెట్టి రెండు వైపులా జగన్‌ చిత్రాలు పెట్టారు.

స్థలం కబ్జా చేసిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్- పవన్ కార్యాలయం ఎదుట బాధితురాలి ఆత్మహత్యాయత్నం - Women Suicide Attempt

ఊరు పోలవరం అయితే జగన్‌ పేరు పెట్టారేంటని ప్రశ్నించినా వైఎస్సార్సీపీ నాయకులు లెక్క చేయలేదు. దీంతో ఆగ్రహంతో ఉన్న కొందరు యువత ఆర్చి ఎక్కి పేర్లు పీకేసి తమ నిరసన తెలిపారు. అక్కడ జనసేన జెండా ఎగరవేశారు. ఇన్నాళ్లూ ఓపిక పట్టాం - ఇక తగ్గమని తేల్చి చెప్పేశారు. ప్రశ్నించిన వారికి నేమాం కాలనీ దగ్గర ఆర్చి కట్టుకుని పేరు పెట్టుకోండి, మా ఊరికి జగన్‌ పేరేంటి అని సమాధానం ఇచ్చారు.

రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ వర్గీయులు - టీడీపీ కార్యకర్తలపై దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.