ETV Bharat / state

రుషికొండ భవనాలను ఆకస్మికంగా పరిశీలించిన పవన్‌ కల్యాణ్‌ - PAWAN KALYAN RUSHIKONDA VISIT

విజయనగరం పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో రుషికొండ భవనాల పరిశీలన

Pawan_Kalyan_Rushikonda_Visit
Pawan Kalyan Rushikonda Visit (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 21, 2024, 5:18 PM IST

Updated : Oct 21, 2024, 9:04 PM IST

Pawan Kalyan Rushikonda Visit : విశాఖలోని రుషికొండ భవనాలను డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆకస్మికంగా పరిశీలించారు. విజయనగరం పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో రుషికొండ భవనాలను పరిశీలించేందుకు వచ్చారు. పవన్‌ కల్యాణ్‌ వెంట జనసేన నేతలు, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఉన్నారు.

రుషికొండ నిర్మాణాల వద్ద ఉన్న కార్మికులతో పవన్ కల్యాణ్ మాట్లాడారు. డిప్యూటీ సీఎం​ పర్యటనతో ఋషికొండ భవనాల వినియోగంపై మరింత దృష్టి పెట్టినట్టు అయ్యింది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ భవనాలను ఏం చేయాలి అనే దానిపై కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. అందులో భాగంగానే రుషికొండ నిర్మాణాలను పవన్ కల్యాణ్​ పరిశీలించారు. భవనాల పరిశీలన అనంతరం విశాఖ విమానాశ్రయానికి పవన్‌ కల్యాణ్‌ బయలుదేరి వెళ్లారు.

గుర్లలో పవన్‌ కల్యాణ్‌ పర్యటన - మృతుల కుటుంబాలకు వ్యక్తిగత పరిహారం

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 9.68 ఎకరాల విస్తీర్ణంలో రుషికొండపై నిర్మాణాలను చేపట్టారు. మొత్తం ఏడు ప్రధానమైన భవనాలను నిర్మించారు. విజయనగర 1, 2, 3 అనే మూడు భవనాలతో పాటు కళింగ, వేంగి, గజపతి అనే ఇతర భవనాలను నిర్మాణం చేశారు. వీటి నిర్మాణానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అదే విధంగా పర్యావరణపరంగా ఉన్న ఇతర విధింపుల ద్వారా మరో 200 కోట్ల రూపాయలు ఇవ్వాలి. మొత్తంగా దీని విలువ సుమారు 700 కోట్ల రూపాయలు అయింది.

ఇంత భారీ మొత్తంలో వెచ్చించి నిర్మించిన విలాసవంతమైన భవనాలను ఏం చేయాలి అని అంశంపై కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటికే దీనిపై అనేక సార్లు పరిశీలించింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత భవనాల నిర్వహణ కూడా పెద్ద భారంగా మారింది. అనేక బిల్లులు లక్షల్లో పెండింగ్​లో ఉన్నాయి. దీంతో ఈ భవనాలను వినియోగంలోకి తీసుకురావడంతో పాటు, రహదారులను కూడా ప్రజావసరాల కోసం అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్​ రుషికొండపైన నిర్మాణాలను పరిశీలించారు. తద్వారా త్వరలోనే ఈ నిర్మాణాలపై ఓ కీలకమైన నిర్ణయం త్వరలోనే తీసుకునే అవకాశం ఉంది.

రుషికొండ ప్యాలెస్ ఖర్చు రోజుకు ఎంతో తెలుసా? - ప్రైవేటుకు అప్పగించే యోచనలో ప్రభుత్వం - Rushikonda Palace Maintenance

Last Updated : Oct 21, 2024, 9:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.