Pawan Kalyan Giving B forms to Janasena Candidates at Mangalagiri: జనసేన పార్టీ అభ్యర్థులకు ఈరోజు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బీ ఫారంలు అందజేశారు. ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్ బీ ఫారంలను అభ్యర్థులకు అందజేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులందరూ పార్టీ కార్యాలయానికి రావాలని పవన్ కల్యాణ‌్ పిలుపునిచ్చారు.
జగన్కు శ్రీలంక అధ్యక్షుడికి పట్టిన గతే: పవన్ కల్యాణ్ - Pawan kalyan Election Campaign
జనసేన అభ్యర్థులతో ప్రతిజ్ఞ: రేపటి నుంచి నామినేషన్ల కార్యక్రమం ప్రారంభం కానుండటంతో ఈరోజు అభ్యర్థులకు బీఫారంలు అందచేయాలని పవన్ నిర్ణయించారు. జనసేన పార్టీ ఈసారి పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ స్థానాల్లోనూ, రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేయనుంది. పవన్ కల్యాణ‌్ పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలో ఉండనున్నారు. పోటీ చేయనున్న అభ్యర్థులందరూ ముహూర్తాలు చూసుకుని నామినేషన్ వేసుకునేందుకు వీలుగా ఈరోజు బీఫారంలు అందజేస్తున్నట్టు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రాన్ని రామరాజ్యం వైపు నడిపిస్తామని అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అభ్యర్థులకు పవన్ కల్యాణ్ బీ ఫారంలు అందజేసిన అనంతరం పార్టీ అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలసి పనిచేయాలంటూ ప్రతిజ్ఞలో పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ ఏ ఒక్క కులానికో నాయకుడు కాదు: కిరణ్ కుమార్ రెడ్డి - Nallari Kiran Kumar Reddy
బీఫారంలు అందజేసిన జనసేనాని: అవినీతి, దుష్టపాలన తరిమికొట్టేందుకు అందరూ కలసి పనిచేయాలని జనసేనాని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల చాలా కీలకమైనవని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. గత ఎన్నికల నుంచి ఎంతో కష్టపడి పనిచేశామన్నారు. శ్రీరామనవమి పురస్కరించేందుకు రామరాజ్యం వైపు రాష్ట్రాన్ని మళ్లించేందుకు ఈరోజు బీఫారంలు అందించాలని నిర్ణయించినట్టు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పాలకొల్లు అభ్యర్థి రావటం ఆలస్యం కావటంతో 20 మంది అసెంబ్లీ , 2 పార్లమెంటు అభ్యర్థులకు భీపారంలు అందించినట్టు పవన్ కల్యాణ్ తెలిపారు.
నాదెండ్ల మనోహర్: రాష్ట్రాన్ని వైఎస్సార్సీపీ నుంచి విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేయాలని జనసేనని ఆలోచన చేశారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో కూటమిని బలోపేతం చేయడానికి ప్రజల్లోకి పార్టీ నేతలు తీసుకెళ్లి, కూటమి గురించి ప్రజలకు తెలియజేయాలని నాదెండ్ల కోరారు.ఈ ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు.