Passengers Facing Problems Due to Jagan Bus Yatra : సీఎం జగన్ సభలు సామాన్యుల పాలిట శాపంగా మారాయి. ఎక్కడ సభలు ఏర్పాటు చేసిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రయాణికులు ఉదయం నుంచి కళ్లల్లో వత్తులు వేసుకొని చూస్తున్నారు. ఒకవైపు తీవ్ర ఎండాతో పాటు వడగాలులు వీస్తున్న సమయంలో సాధారణ ప్రయాణికులతో పాటు వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జగన్ సభలు ముగిసే వరకూ తిప్పలు తప్పవా? - ఆర్టీసీ తీరుపై ప్రయాణికుల ఆగ్రహం
ఈరోజు నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించే 'మేమంతా సిద్ధం' సభకు ఆర్టీసీ బస్సులు తరలించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు గంటల తరబడి ఎదురుచూసి విసిగిపోతున్నారు. చివరికి బస్సులు లేక పోవటంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు.
Jagan bus Yatra in Kavali : నెల్లూరు జిల్లా కావలిలో సీఎం బస్సు యాత్రకోసం ప్రకాశం జిల్లాలోని 210 బస్సులు కేటాయించారు. ఒంగోలు నుంచి 48 బస్సులు, గిద్దలూరు నుంచి 42 బస్సులు, మార్కాపురం నుంచి 58 బస్సులు, కనిగిరి నుంచి 32 బస్సులు, పొదిలి నుంచి 30 బస్సులు కేటాయించడంతో ప్రకాశం జిల్లాలోని అన్ని బస్టాండుల్లో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఒకవైపు తీవ్ర ఎండాతో పాటు వడగాలులు వీస్తున్న సమయంలో సాధారణ ప్రయాణికులతో పాటు వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి బస్టాండ్లలో పడి కాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. ఇక చిన్నారులకు గాలి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఉదయం నుంచి బస్సుకోసం బస్టాండులో పడిగాపులు కాస్తున్నాం. మధ్యాహ్నం అవుతుంది ఇప్పటివరకు ఒక్క బస్సు కూడా రాలేదు. ఈ ఎండ వేడికి మాతో పాటు వచ్చిన పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీఎం ప్రోగ్రాం ఉంటే ప్రైవేట్ బస్సులు పెట్టుకోవాలి కానీ ప్రభుత్వ బస్సులను కేటాయించడం ఏంటి?. ఇక్కడ చాలామంది దూర ప్రాంతాలకు వెళ్లాలి. బస్సు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఉదయం నుంచి కళ్లల్లో వత్తులు వేసుకొని చూస్తున్నాం. ఆర్టీసీ సిబ్బందిని అడిగితే సరైన సమాధానం ఇవ్వడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మా సమస్యలను అర్థం చేసుకొని బస్సులు కేటాయించాలని కోరుతున్నాం. - ప్రయాణికురాలు, ఒంగోలు
CM bus Yatra : అలాగే కావలిలో సీఎం జగన్ సభకోసం బాపట్ల డిపో నుంచి 26 బస్సులను అధికారులు కేటాయించారు. దీంతో బాపట్ల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే సర్వీసులను రద్దు చేశారు. బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. బస్సులు లేక పోవటంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు.
గుత్తిలో తుస్సుమన్న 'మేమంతా సిద్ధం' యాత్ర - జగన్ బస్సు వైపు చెప్పు విసిరిన గుర్తు తెలియని వ్యక్తి
జగన్ బస్సు యాత్రను అడ్డుకున్న గ్రామస్థులు - తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ ఆవేదన