Party Leaders Palabhishekam on the Occasion of BC Declaration : ఇటీవలే 10 అంశాలతో టీడీపీ-జనసేన బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు, టీడీపీ, జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ పాలనలో అన్ని విధాలుగా ఇబ్బందులకు గురైన బీసీల బాగు కోసమే టీడీపీ-జనసేన ఉమ్మడి డిక్లరేషన్ తీసుకొచ్చిందని టీడీపీ నేతలు తెలిపారు. దీని ద్వారా రాష్ట్రంలోని బీసీలకు పూర్వ వైభవం తీసుకువస్తామని టీడీపీ విజయనగరం పార్లమెంట్ అధ్యక్షుడు కిమిడి నాగార్జున తెలియచేశారు. టీడీపీ-జనసేన ఉమ్మడి బీసీ మేనిఫెస్టోలో ప్రకటన నేపథ్యంలో ఆ పార్టీ అధినేతల చిత్రపటాలకు విజయనగరం జిల్లా టీడీపీ కార్యాలయంలో పాలాభిషేకం నిర్వహించారు.
బీసీ డిక్లరేషన్ సభ విజయవంతంపై వైసీపీ నేతలకు ఓటమి గుబులు పట్టుకుంది: పోతిన మహేష్
ఈ కార్యక్రమంలో కిమిడి నాగార్జునతో పాటు విజయనగరం నియోజకవర్గ టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి అదితి గజపతిరాజు, పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. బీసీ డిక్లరేషన్‌కు తమ మద్ధతు తెలియచేస్తూ టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి స్వామి భక్తిని చాటుకున్నారు.
సరికొత్త విధంగా బీసీ డిక్లరేషన్- ప్రతి ఒక్క బీసీ సోదరుడు హర్షించదగిన సమయం
రాష్ట్రంలో బీసీలకు మొట్టమొదట న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీనే కిమిడి నాగార్జున వెల్లడించారు. నందమూరి తారక రామారావు రాక ముందు బీసీల పరిస్థితి ఒకలా, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు రాజ్యాధికారంతో పాటు వారి అభివృద్ధి కోసమూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని ఈ సందర్భంలో గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ అనంతరం అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు కూడా అదే పద్ధతిని పాటించారని పేర్కొన్నారు.
బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ - 10 అంశాలతో టీడీపీ-జనసేన 'బీసీ డిక్లరేషన్'
కానీ 2019లో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి బీసీ వర్గాలకు అన్ని విధాలుగా అన్యాయం చేశారని అదితి గజపతిరాజు వ్యాఖ్యానించారు. బీసీల సంక్షేమ పథకాల్లో కోత విధించటమే కాకుండా రాజకీయంగా, ఆర్థికంగా వారిపై దాడులు జరిపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన అనంతరం బీసీలకు పూర్వవైభవం కల్పించేందుకు టీడీపీ-జనసేన ఉమ్మడి బీసీ డిక్లరేషన్ తీసుకు వచ్చిందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు బీసీల అభివృద్ధి ధ్యేయంగా భవిష్యత్తు కార్యచరణను రూపొందిస్తున్నారని పేర్కొన్నారు. బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించావలసిందిగా ప్రజలకు సూచించారు.