ETV Bharat / state

బంగారం కోసం - కుమార్తె ఇంటి ఎదుట తల్లిదండ్రుల ఆందోళన - PARENTS PROTEST IN DAUGHTER HOUSE

మల్కాజిగిరిలో కుమార్తె ఇంటి ముందు తల్లిదండ్రుల ధర్నా

Parents Protest Daughter House in Malkajgiri
Parents Protest Daughter House in Malkajgiri (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 21, 2024, 12:12 PM IST

Parents Protest Daughter House in Malkajgiri : డబ్బు డబ్బు నువ్వు ఏం చేస్తావ్? అంటే ప్రాణ స్నేహితులను విడగొడతాను. తండ్రీ పిల్లల మధ్య చిచ్చు పెడతాను. మనుషులు విచక్షణ కోల్పోయేలా చేసి బంధాలు తెంచేస్తానని చెబుతుంది అనేది ఓ నానుడి. నేటి కాలంలో ఒకప్పుడు మానవ సంబంధాలకు పెద్దపీట వేసేవారు. కానీ నేడు ఆస్తిపాస్తులు, డబ్బుకు విలువ ఇస్తున్నారు. ఎంతలా అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు, రక్త సంబంధీకులనైనా మోసం చేసేందుకు సిద్ధపడుతున్నారు.

డబ్బుంటే చాలు ఏది అవసరం లేదన్న రీతిలో కొందరి వ్యవహారం ఉంటుంది. ఈ ఘటన చూస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది. తాజాగా కుమార్తెనే తమను మోసం చేసిందని ఓ తల్లిదండ్రులు నిరసనకు దిగారు. బంగారు ఆభరణాలను దాచి ఉంచమని ఆమెకు ఇవ్వడమే వారు చేసిన అపరాధమా!. మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేసిన ఈ ఉదంతం తెలంగాణలోని మల్కాజిగిరిలో చోటుచేసుకుంది.

మల్కాజిగిరి సర్కిల్‌ వాణీనగర్‌లో కన్న కుమార్తెనే మోసం చేసిందని తల్లిదండ్రులే ఆమె ఇంటి ముందు నిరసనకు దిగారు. ఊరెళ్తూ తమ వద్ద ఉన్న 30 తులాల బంగారాన్ని ఇంట్లో దాచిపెట్టమని ఇచ్చామని, ఇప్పుడు తిరిగి ఇవ్వమంటే ఆమె నిరాకరిస్తుందని ఆరోపించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం శివమ్మ, మల్లయ్య దంపతులు మల్కాజిగిరి సర్కిల్​లో నివాసం ఉంటున్నారు. కుమార్తె బాలమణి వారి ఇంటికి సమీపంలోనే ఉంటోంది.

శివమ్మ, మల్లయ్య దంపతులు రెండు సంవత్సరాల క్రితం ఊరెళ్తూ వారి వద్దనున్న బంగారాన్ని కుమార్తె బాలమణికి దాచి ఉంచమని అప్పగించారు. అప్పటి నుంచి ఆమె వాటిని తిరిగి ఇవ్వక పోవడంతో బుధవారం నాడు వినియోగదారులు, మానవహక్కుల పరిరక్షణ సమితి సభ్యుల సహకారంతో వృద్ధ దంపతులు బాలమణి ఇంటి ముందు ధర్నాకు దిగారు. గతంలో పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోయిందని ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. కన్న కుమార్తె ఇలా చేయడం భావ్యమా? వృద్ధాప్యంలో తమను రోడ్డెక్కేలా చేయడం తగునా అని వారు వాపోయారు. ఈ విషయంపై డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ వృద్ధులను, ఆమె కుమార్తెను స్టేషన్‌కు పిలిచినట్లు తెలిసింది.

Notices Old Woman: కుమారుడి నిర్వాకంతో.. 70 ఏళ్ల వయస్సులో రోడ్డున పడ్డ మాతృమూర్తి

కన్నతల్లి భారమైందని.. రైలెక్కించి పంపించేశారు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.