Telangana Osmania Arts College Rare Feat: భాగ్యనగర చరిత్రలో ప్రసిద్ధి చెందిన ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల భవనం అరుదైన గుర్తింపును దక్కించుకుంది. 1939లో నిర్మించిన ఈ భవనం జాతీయ స్థాయి మేధో సంపత్తి హక్కుల పరిరక్షణ విభాగంలో ‘ట్రేడ్ మార్క్’ రిజిస్ట్రేషన్ పొందనుంది. ఇది పూర్తయ్యాక ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల భవనం డిజైన్‌ను వ్యక్తులు, సంస్థలు వాణిజ్యపరంగా వినియోగించుకునేందుకు వీలుండదు. టీ కప్పులు, మగ్గులు, బహుమతులపై ఆర్ట్స్ కళాశాల భవనం ఫొటోలను ముద్రించకూడదు. నిబంధనలు ఉల్లఘించిన వారిపై విశ్వవిద్యాలయం అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకోనున్నారు. మరో నాలుగైదు నెలల్లో ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ రానుందని వర్సిటీ తెలిపింది. మన దేశంలో ట్రేడ్‌మార్క్ గుర్తింపు ఇప్పటి వరకు ముంబయిలోని హోటల్ తాజ్‌మహల్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ భవనానికి మాత్రమే ఉండగా దక్షిణ భారతదేశంలో ట్రేడ్‌మార్క్ పొందిన తొలి భవనంగా గుర్తింపు లభించనుంది.
"నువ్వేం ఆడతావ్" అన్నవాళ్లే ఇప్పుడు శభాష్ అంటున్నారు - భవానీ నీకు సెల్యూట్!