ETV Bharat / state

ఓఆర్‌ఆర్‌పైకి వెళ్లాక సమస్యా? - ఈ నంబర్​కు కాల్ చేస్తే 15 నిమిషాల్లో పరిష్కారం ఖాయం - ఓఓఆర్‌ టోల్‌ఫ్రీ నంబర్‌

ORR Helpline In Hyderabad : హైదరాబాద్‌ చుట్టూ ట్రాఫిక్ లేని ప్రయాణం కోసం నిర్మించిన బాహ్య వలయ రహదారిపై చోదకులు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రయాణం చేస్తుంటారు. ఆ ప్రయాణం మధ్యలో ఏదైనా సమస్య ఏర్పడితే ఏం చేయాలో తెలియక, ఎవర్నీ సంప్రదించాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికోసం ఓఓఆర్‌పై ఓ టోల్‌ఫ్రీ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి వాహన చోదకులకు హెచ్‌ఎమ్‌డీఏ నిరంతర సేవలందిస్తోంది.

Outer Ring Road In Hyderabad
Outer Ring Road Toll Free Number In Hyderabad
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 20, 2024, 1:39 PM IST

ఓఆర్‌ఆర్‌పైకి వెళ్లాక సమస్యా? ఈ నంబర్​కు కాల్ చేస్తే 15 నిమిషాల్లో పరిష్కారం ఖాయం

ORR Helpline In Hyderabad : హైదరాబాద్ ట్రాఫిక్ రద్దీని దాటి గమ్యం చేరాలంటే గతంలో ఒకప్పుడు దాదాపు 3 గంటలు సమయం పట్టేది. ఆ సమస్యకు శాశ్వత పరిష్కారంగా హైదరాబాద్(Hyderabad) చుట్టూ అన్ని ప్రాంతాలకు సులువుగా చేరుకునేలా 8 వరుసల్లో 158 కిలోమీటలర్ల మేర బాహ్య వలయ రహదారిని నిర్మించారు. తద్వారా వాహన చోదకులు ఎలాంటి ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా సులువుగా గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. అయితే కొందరు రహదారి ప్రమాణాలు పాటించకపోవడంతో ఇటీవల ఈ ఓఓఆర్‌పై ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. వాటిని నివారించడం సహా చోదకులకు సహాయం అందించేందుకు హెచ్‌ఎమ్‌డీఏ చర్యలు చేపట్టింది.

Outer Ring Road In Hyderabad : బాహ్యవలయ రహదారిపై ప్రయాణించే సమయంలో ఏదైనా సమస్య వస్తే ఏం చేయాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు అదే పరిస్థితి. డీజిల్, పెట్రోల్ అయిపోయినా కొందరు స్నేహితులకు ఫోన్‌ చేసి తెప్పించుకుంటారు. అలాంటివి చేయకుండా వెంటనే 14449 అనే టోల్‌ ఫ్రీ నెంబర్‌కి ఫోన్‌చేస్తే 15 నిముషాల్లో సాయం అందిస్తారు. చోదకుని వద్ద ఫోన్‌ లేకపోతే ప్రతీ కిలోమీటరుకు ఓ ఏసీఎస్ బాక్స్‌ను అమర్చారు. తద్వారా సమాచారాన్ని తెలియజేసినా వెంటనే పెట్రోలింగ్ బృందం వచ్చి సాయం అందిస్తారు.

Vechicles Speed In crease On ORR : ఓఆర్​ఆర్​పై 100 కాదంట.. ఇక నుంచి 120KMPH వెళ్లొచ్చు

"అవుటర్‌ రింగ్‌ రోడ్‌పైన వాహనదారులకు అవగాహన లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు, పెట్రోల్‌, డీజిల్‌ ఖాళీ అయినప్పుడు వాళ్ల బంధువులకు, స్నేహితులకు ఫోన్‌ చేస్తారు. అలా కాకుండా వెంటనే ఓఆర్​ఆర్‌ ప్రత్యేకంగా 14449కి టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఏర్పాటు చేశాం. ఈ నంబర్‌కు కాల్‌ చేస్తే 15 నిమిషాల్లో ఏ ఇతర సాయమైనా అందిస్తాం." - కిట్టు, ఓఆర్‌ఆర్‌ గుత్తేదారు ప్రతినిధి

Hyderabad Ring Road : ప్రమాదాలు జరిగినా అంబులెన్స్, పారామెడికల్‌ సిబ్బంది అందుబాటులో ఉన్నారు. ప్రతి పది కిలోమీటర్లకు ఒకటి చొప్పున ట్రామా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా వాహన చోదకులకు నిత్యం సేవలు అందిస్తున్నారు. టోల్‌ఫ్రీ నెంబర్‌పై సరైన అవగాహన లేకపోవడంతో ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. వారికి అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. ఎలాంటి సమస్య రాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో తీసుకొచ్చిన టోల్‌ఫ్రీ నంబర్‌ను వాహనచోదకులు వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ORR Controversy Latest Updates : 'ఓఆర్‌ఆర్‌ వివాదం'పై HMDA లీగల్‌ నోటీసులు.. రేవంత్‌ సమాధానమిదే

"దాదాపు ప్రతి వాహనం మోతాదు మించి వేగంగా వెళ్తోంది. బాహ్య వలయ రహదారిపై చోదకుల అవగాహన కోసం కరపత్రాలు పంచాం. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని హెచ్‌ఎండీఏ, పోలీస్‌శాఖల తరపున కోరుతున్నాం." - రామకృష్ణారెడ్డి, ట్రాఫిక్ సీఐ పటాన్ చెరు

Hyderabad Outer Ring Road: 'బంగారు బాతు ఓఆర్​ఆర్​ను కేటీఆర్ 30 ఏళ్లకు అమ్మేశారు'

పాదచారులు, సైక్లిస్ట్​లకు జై.. ట్రాఫిక్, కాలుష్యానికి బై!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.