Opposition Protest over Delay in Pensions Distribution: పింఛన్ల పంపిణీ జాప్యంపై ప్రతిపక్షాల నిరసన బాట పట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం-జనసేన-బీజేపీ శ్రేణులు ఆందోళన దిగారు. ఇవాళ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు మౌన దీక్షలు చేపట్టారు. సకాలంలో పింఛన్‌దారులుకు పంపిణీ చేయకుండా కావాలనే ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి సచివాలయ సిబ్బందితో పింఛన్ పంపిణీని చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాలపై బురద జల్లేందుకే ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని వైసీపీ రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు.
పింఛన్ల పంపిణీపై వైసీపీ వికృత రాజకీయం- పథకం ప్రకారం టీడీపీపై కుట్ర - AP Pensions Distribution Issue
టీడీపీ వల్లే ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఆగిపోయిందని విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పింఛన్లను ఇంటింటికీ వెళ్లి ఇచ్చేందుకు తాము వ్యతిరేకం కాదని ఎన్డీయే నేతలు తెలిపారు. వాలంటీర్లు అందరూ తమ వాళ్లే అని గతంలో వైసీపీ నేతలే చెప్పారన్న నేతలు తమపై దుష్ప్రచారం చేసేందుకు కావాలనే కుట్రలు చేస్తున్నారన్నారు. వాలంటీర్లను వినియోగించాల్సిన అవసరం లేకుండా పింఛన్ల పంపిణీపై సీఎస్, సర్ప్ సీఈవో బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలో పింఛన్లను ఇంటింటికీ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
TDP Leaders Fire on YSRCP Govt: పేదలకు ఇళ్ల వద్ద పింఛను అందకుండా కుట్ర పన్నిన జగన్ ప్రభుత్వం ఆ నెపం తమపై నెడుతోందని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. పంచాయితీలకు ఇంతవరకూ నిధులు విడుదల చేయకుండా దురుద్దేశపూర్వకంగానే పింఛన్ల పంపిణీని జాప్యం చేస్తోందని ఆరోపించారు.
పేదలకు ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేసే విధానానికి తెలుగుదేశం కట్టుబడి ఉందన్న నేతలు, దీన్ని అడ్డుకుంటున్న వైసీపీ ప్రభుత్వంపై పోరాటం ఉద్ధృతం చేస్తామని తేల్చి చెప్పారు. పార్టీ కేంద్రకార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో సమావేశమైన తెలుగుదేశం నేతలు పింఛన్ జాప్యం అంశంపై చర్చించి రాష్ట్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. తక్షణమే సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛను పంపిణీ చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.