ETV Bharat / state

కనుమరుగవుతున్న ఆ గ్రామం.. - Old Edlanka Submerged to Krishna - OLD EDLANKA SUBMERGED TO KRISHNA

Old Edlanka Village Submerged in Krishna River Floods : ఒకటి కాదు రెండు కాదు వందల ఎకరాలు కృష్ణానది తనలో కలిపేసుకుంటుంది. పదుల సంఖ్యలో ఇళ్లను కృష్ణమ్మ తనలో కలసిపోతున్నాయి. చూసి కన్నీరు పెట్టడం తప్ప ఏమి చేయలేని నిస్సహాయ స్థితి ఆ గ్రామస్థులది. గ్రామ రక్షణ కోసం వంతెన నిర్మిస్తామని గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం హమీ ఇచ్చి మరిచింది. కృష్ణమ్మకు వరదలు వచ్చిన ప్రతిసారీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

OLD EDLANKA SUBMERGED TO KRISHNA
OLD EDLANKA SUBMERGED TO KRISHNA (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 13, 2024, 9:04 AM IST

Old Edlanka Village Submerged in Krishna River Floods : చుట్టూ నీరు మధ్యలో భూమి! ఓ ద్వీపాన్ని తలపించే ఆ గ్రామానికి ఇప్పుడు ఆపదవచ్చింది. ఏటికేడు కృష్ణమ్మ ఆ గ్రామాన్ని కలిపేసుకుంటోంది. ఇళ్లు, పొలాలను మింగేస్తోంది. ఊరి ఉనికికే ముప్పు ముంచుకొచ్చింది. బిక్కుబిక్కుమంటున్న బాధితులు ప్రభుత్వం ఎక్కడైనా పునారావాసం కల్పిస్తే ప్రశాంత జీవనం సాగిస్తామని వేడుకుంటున్నారు.

ఏరియల్‌ వ్యూలో చూస్తుంటే ఈ గ్రామం ఆహ్లాదంగా కనిపిస్తోంది కదూ! పైకి అలాగనే కనిపిస్తుంది. ఇదిగో ఇలా దగ్గరకు వెళ్లి చూస్తేగానీతెలియదు ఆగ్రామం ఎంత ప్రమాదంలో ఉందో! ఒకప్పుడు కొంచెం ముందుకుండే గ్రామం ఇప్పుడు కుంచించుకుపోతోంది. భూ విస్తీర్ణం కొంచెంకొంచెంగా కేకు ముక్కలా కృష్ణానదిలో కలిసిపోతోంది పాత ఎడ్లలంక.

కోనసీమ లంక గ్రామాలను ముంచేసిన గోదావరి - డ్రోన్ విజువల్స్ - Flood Affect in Mummidivaram

కృష్ణానదికి వరదలు వస్తే మా గ్రామం, పొలాలు కోతకు గురవుతున్నాయి. కూలీనాలీ చేసి రూపాయి రూపాయి కూడపెట్టుకొని ఇళ్లు, పొలాలు తీసుకున్నాం. అవి ఇప్పుడు కాస్తా కృష్ణనదిలో కలిసిపోతున్నాయి. ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించి మాకు వేరే చోట స్థలం చూపించి ఇళ్లు కట్టించవలసిందిగా కోరుతున్నాం- పాత ఎడ్లలంక గ్రామస్థులు

పైసాపైసా పోగేసి : పాత ఎడ్లలంక గ్రామంలో ప్రతి ఒక్కరూ భయం భయంగానే బతుకుతున్నారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గ కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ఈ ఊరిలో సుమారు 1060 మంది ప్రజలు, 400 ఇల్లు ఉన్నాయి. ఏటా కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడల్లా సుమారు పది గృహాలు కృష్ణానదిలో కలిసిపోతున్నాయి. కూలీనాలీ చేసుకుని కట్టుకుని ఇల్లు, పైసాపైసా పోగేసి కొనుక్కున్న పొలాలు కళ్లముందే కరిగిపోతుంటే బాధితులు తట్టుకోలేకపోతున్నారు.

నాలుగో రోజూ ఏలేరు వరద ప్రభావం - పిఠాపురం నియోజకవర్గంలో స్తంభించిన రాకపోకలు - Yeleru floods in Pithapuram

గ్రామాన్ని రక్షించాలంటే రివిట్‌మెంట్ కట్టాలి : పాత ఎడ్లలంక ప్రక్కన కృష్ణానది గత కొన్నేళ్లుగా తన దిశను మార్చుకొంటోంది. ఇటీవల ప్రకాశం బ్యారేజ్‌కు చరిత్రలోనే అత్యధికంగా 11 లక్షల క్యుసెక్యుల వరద పోటెత్తింది. కృష్ణమ్మ మహోగ్రరూపానికి ఈసారి ఏకంగా 20 ఎకరాలు, అనేక గృహాలు నదిలో కలిసిపోయాయి. గ్రామంలో కోతకుగురైన ఇల్లు, పొలాల్ని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పరిశీలించారు. 2009 లో వరదలు వచ్చినప్పుడు ఇక్కడ కోత మొదలైందని, దీన్ని రక్షించాలంటే రివిట్‌మెంట్ కట్టాలి ఆనాడే ప్రభుత్వాన్ని కోరామన్నారు. అధికారులు అంచనాలు వేయడం తప్ప ఎక్కడా నిధులు మంజూరు చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్​ దృష్టికి తీసుకెళ్లానని, రివిట్‌మెంట్ కోసం నిధులుుమంజూరు చేస్తారనని బుద్ధప్రసాద్‌ విశ్వాసం వెలిబుచ్చారు.

నిద్రలేచే సరికి నీళ్ల మధ్యలో ఆవాసాలు- కాకినాడలో ఏలేరు ఉగ్రరూపం - Yeleru Floods in Kakinada

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.