ETV Bharat / state

కౌంటింగ్ ప్రక్రియకు పటిష్ట ఏర్పాట్లు - పలు జిల్లాల్లో 144 సెక్షన్ - Arrangements for Vote Counting - ARRANGEMENTS FOR VOTE COUNTING

Officials Making Strict Arrangements for Vote Counting Process: రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి హింసాత్మక ఘటనలు, అల్లర్లు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా మాక్ డ్రిల్స్, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పలు జిల్లాల్లో సెక్షన్ 144, పోలీసు యాక్ట్ 30 అమలు చేస్తున్నట్లు తెలిపారు.

arrangements_for_vote_counting
arrangements_for_vote_counting (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 22, 2024, 8:05 PM IST

కౌంటింగ్ ప్రక్రియకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్న అధికారులు - పలు జిల్లాల్లో సెక్షన్ 144 (ETV Bharat)

Officials Making Strict Arrangements for Vote Counting Process: ఓట్ల లెక్కింపు రోజు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మాక్ డ్రిల్స్, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సెక్షన్ 144, పోలీసు యాక్ట్ 30 అమల్లో ఉన్నందున ఎక్కువ మంది గుమికూడటం, ర్యాలీలు నిర్వహించడం నిషేధమని స్పష్టం చేశారు. ఎవరైనా చట్టాన్ని ఉ‌ల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Guntur District: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సుమారు వందమంది పోలీసులు ప్రతి ఇంట్లో సోదాలు చేశారు. గుర్తింపు పత్రాలు లేని 15 వాహనాలను జప్తు చేశారు. ఎన్నికల ఫలితాల రోజున, ఆ తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామన్నారు.

పిన్నెల్లిపై పది సెక్షన్లు- ఏడేళ్ల వరకూ శిక్ష పడే అవకాశం: సీఈవో - CEO MK Meena on Macherla Incidents

Krishna District: జూన్ 4న కౌంటింగ్ రోజున శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం డీఎస్పీ అబ్దుల్ సుభాన్ హెచ్చరించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్దకు అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు మినహా ఇతరులకు అనుమతి లేదన్నారు.

YSR District: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో అడిషనల్ ఎస్పీ వెంకటరాముడు ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు.

'బెదిరింపులు భరించలేకున్నాం, కౌంటింగ్ వరకూ డ్యూటీ చేయలేం' - ఈసీని సెలవు కోరుతున్న ఆర్వోలు - ROs Requesting EC for Leaves

Konaseema District: పోలింగ్‌ రోజున కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో హింసాత్మక ఘటనలు జరగడంతో అధికార యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాటుచేస్తోంది. ఓట్ల లెక్కింపు రోజు అల్లర్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాట్రేనికోన మండలం చెయ్యేరు శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలలోని లెక్కింపు కేంద్రం వద్ద ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. మూడంచెల భద్రతతోపాటు సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతోంది. ఇక్కడి ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా, ఎస్పీ శ్రీధర్ పరిశీలించారు. భద్రతా సిబ్బందికి తగు సూచనలు చేశారు.

ఎక్కడున్నారో ఎలా ఉన్నారో! - అల్లర్లలో ఇరుక్కున్న యువకుల తల్లిదండ్రుల ఆవేదన - Election Violence

Kakinada District: కాకినాడ జిల్లాలో కౌంటిగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు పూర్తి ఏర్పాట్లు చేసినట్టు ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. వివిధ పార్టీల నాయకులతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. పోలింగ్ రోజున చిన్న చిన్న ఘటనలు జరిగాయని లెక్కింపు సందర్భంగా సంయమనంతో వ్యవహరించాలని కోరారు. రెచ్చెగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Visakha District: ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా నిర్వహించడంపై విశాఖ జిల్లా అధికారులతో కలెక్టర్ మాల్లికార్జున సమీక్ష నిర్వహించారు. కౌంటింగ్ సమయంలో ఏవిధంగా వ్యవహరించాలనే అంశాన్ని సిబ్బందికి వివరించారు. అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలు లెక్కించేదుకు 900 మంది సిబ్బందిని కేటాయించామన్నారు. ఒక్కో నియోజవర్గానికి 14 చొప్పున బల్లలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. భారీ భద్రత మధ్య ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూంలను పర్యవేక్షిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.