Officials Demolish YSRCP Leaders Illegal Construction : అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి వద్ద ఉన్న తన పలుకుబడి చాటుతూ అధికార యంత్రాంగాన్ని కాకినాడకు చెందిన గత ప్రజాప్రతినిధి గుప్పెట్లో పెట్టుకున్నారు. తన మాట వినలేదని మున్సిపల్ కమిషనర్‌గా వచ్చిన ఓ ఐఏఎస్ అధికారిని 4 నెలల్లో బదిలీ చేయించారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్షాలపై కేసులకు లెక్కేలేదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక అక్రమాలను నిగ్గుదేల్చే పనిలో పడింది. పోర్టు కేంద్రంగా సాగిన రేషన్ బియ్యం దందాకు అడ్డుకట్ట పడేలా చర్యలు చేపట్టింది.
అక్రమ కట్టడాలను తొలగించిన అధికారులు : కాకినాడలోని సంతచెరువు వద్ద డ్రెయిన్‌పై అక్రమంగా నిర్మించిన 4 దుకాణాలను నగరపాలక సంస్థ సోమవారం కూల్చి వేసింది. నిబంధనలకు విరుద్ధంగా వీటి నిర్మాణానికి గత ప్రజాప్రతినిధి ద్వారాలు తెరిచారు. 'జ్యోతుల మార్కెట్' అభివృద్ధికి కార్పొరేషన్ నుంచి 2 కోట్ల రూపాయలకు మంజూరు చేయించారు. జీ+1 విధానంలో 54 దుకాణాలు నిర్మించారు. గ్రౌండ్‌ఫ్లోరులో 36 నిర్మించగా రెడీమేడ్ దుస్తుల వ్యాపారులకు కేటాయించేలా ఒప్పందం చేసుకున్నారు. 8 లక్షల రూపాయల చొప్పున ఆయన అనుచరులు వసూలు చేసినట్లు సమాచారం. 8 దుకాణాలను తమ వద్ద పెట్టుకుని, ఒక్కోటి 18 లక్షల రూపాయల నుంచి 25లక్షలకు అమ్ముకున్నారు. పై అంతస్తులో సన్‌షేడ్‌ల ఏర్పాటుకు వ్యాపారుల నుంచి రూ.10 లక్షలు లాక్కున్నారు. ఇప్పుడు వీటిని అధికారులు తొలగించారు.
అదనపు అంతస్తు కూల్చివేత : మసీదు సెంటర్ వద్ద మున్సిపల్ స్థలంలో వైఎస్సార్సీపీ నాయకుడు కట్టడం చేపట్టగా అధికారులు ఆ మధ్య తొలగించారు. మాజీ ప్రజాప్రతినిధి కుడి భుజం ఒకరు రాజరాజేశ్వరినగర్‌లో వెయ్యి గజాల మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి, షెడ్లు కట్టి అమ్మేశాడు. సమీపంలో అనుమతి లేకుండా అదనపు అంతస్తు కట్టగా తాజాగా కూల్చి వేశారు.
ద్వారంపూడి అడ్డాలో రేషన్ మాఫియా - సూత్రధారులు, పాత్రధారులపై ఫోకస్ - RATION MAFIA IN KAKINADA
ఎన్నో అక్రమాలు : కాకినాడ రెవెన్యూ కాలనీలోని మాస్టర్ ప్లాన్ రోడ్డును ఆక్రమించి వైఎస్సార్సీపీ నేతలు 2 ఇళ్లను కట్టేశారు. 11వ డివిజన్‌లోని ఐసీడీఎస్ కార్యాలయానికి సమీపంలో మూడు వందల గజాల స్థలాన్ని ఆ పార్టీ మహిళా నేత ఆక్రమించి రెండంతస్తుల భవనాన్ని నిర్మించారు. మరో కీలక అనుచరుడు సూర్యనారాయణపురంలో 300 గజాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారు. 41వ డివిజన్ మాస్టర్ ప్లాన్ రోడ్డుపై ఇంకో అనుంగుడు 60 గజాలు నొక్కేశారు. ఐడియల్ కళాశాల సమీపంలో అయిదుగురికి 400 గజాల రహదారి స్థలాన్ని ఆ నేత ఇప్పించి పట్టాలు జారీ చేయించారు. వీటిలో కొన్ని విక్రయించి సొమ్ము చేసుకున్నారు. శాంతి నగర్, గొడారిగుంట, మెయిన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టారు. పట్టణ ప్రణాళిక విభాగం వీటి లెక్క తేల్చే పనిలో ఉంది.
అక్రమ నిర్మాణాల కూల్చివేతను అడ్డుకున్న ద్వారంపూడి - కేసు నమోదు - Case Filed on Dwarampudi