ETV Bharat / state

ప్రకాశం బ్యారేజీలో పడవల తొలగింపునకు ఎయిర్‌ బెలూన్లు - ప్లాన్​ 'బీ' సక్సెస్​ అయ్యేనా ! - Removing Boats in Prakasam Barrage

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 11, 2024, 9:05 AM IST

Updated : Sep 11, 2024, 10:07 AM IST

Officials on Boats in Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ వద్ద ఇరుక్కున్న భారీ పడవలను వెలికి తీసేందుకు ఇంజినీర్లు, అధికారులు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. బాహుబలి క్రేన్లు 5 గంటల పాటు శాయశక్తులా ప్రయత్నించినా నదిలో చిక్కుకున్న పడవలు ఒక్క అంగుళం కూడా కదల్లేదు. తొలి ప్రణాళిక విఫలం కావడంతో నేడు మరో ప్లాన్​ను అమలు చేయాలని ఇంజినీర్లు నిర్ణయించారు. ఈ మేరకు పడవలను నీటిలోనే కత్తిరించి, తొలగించడానికి విశాఖపట్నం నుంచి ప్రత్యేక బృందాలు వస్తున్నాయని ఏపీ మంత్రి రామానాయుడు తెలిపారు. 120 టన్నుల సామర్థ్యం ఉన్న ఎయిర్‌ బెలూన్స్‌ వస్తున్నాయని, బుధవారం సాయంత్రానికే పడవలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

PRAKASAM BARRAGE OPERATION
Prakasam Barrage Operation in Andhra Pradesh (ETV Bharat)

Prakasam Barrage Operation in Andhra Pradesh : ఏపీలోని ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లకు అడ్డుపడిన పడవలను నీటిలోనే కత్తిరించి, తొలగించడానికి విశాఖపట్నం నుంచి ప్రత్యేక బృందాలు వస్తున్నాయని ఆ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు పేర్కొన్నారు. బ్యారేజీ, ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 120 టన్నుల సామర్థ్యం ఉన్న ఎయిర్‌ బెలూన్స్‌ వస్తున్నాయని, బుధవారం సాయంత్రానికే పడవలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. బోట్లను వెలికితీతకు బేకం సంస్థ చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయని ఏపీ మంత్రి రామానాయుడు తెలిపారు.

మూడు బోట్లు ఒక దానికొకటి కలిపి కట్టి ఉంచారని, ఒక్క పడవ బరువు 40 టన్నులు ఉందని ఏపీ మంత్రి రామానాయుడు చెప్పారు. మూడూ కలిపి మొత్తం 120 టన్నులుగా బ్యారేజీని ఢీకొట్టేలా పంపడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోట్లు కౌంటర్‌ వెయిట్స్‌ను కాకుండా, కట్టడాలను తాకి ఉంటే మూడు జిల్లాలు బంగాళాఖాతంలో కలిసిపోయేవని చెప్పారు. వరదలోనూ రూ.1.50 కోట్ల విలువైన బోట్లకు లంగరు వేసుకోలేదంటేనే ఇది కుట్ర అని అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.

'కుట్ర పూర్వకంగానే మూడు పడవలను మిక్స్​ చేసి 120 టన్నుల బరువున్న పడవలను ప్రకాశం బ్యారేజీలోకి వదిలారు. అధికారం లేదని, జిల్లాలో వాళ్ల పార్టీకి ఒక్క సీటు కూడా లేదని కుట్ర చేశారు'- రామానాయుడు, ఏపీ జలవనరుల శాఖ మంత్రి

ఎలాగైనా భారీ పడవలను బయటకు తీయాలనే లక్ష్యంతో అధికారులు ప్లాన్ బీని సిద్ధం చేశారు. పడవలను ముక్కలుగా కోసి బయటకు తీయడమే మార్గమని నిర్ణయించారు. దీని కోసం విశాఖ నుంచి నిపుణుల్ని రప్పిస్తున్నారు. నదులు, సముద్రాల్లో సైతం దిగి అధునాతన కట్టర్లతో భారీ పడవలను కోసే నైపుణ్యం ఉన్న డైవింగ్ టీంలు రంగంలోకి దిగనున్నాయి. నదిలో పడవల్ని ముక్కలు చేసే పని ప్రారంభించనున్నారు. ఇందుకోసం 120 టన్నుల ఎయిర్ బెలూన్స్ పున్నమి ఘాట్ నుంచి భారీ పంటును సైతం తెస్తున్నారు.

ఎట్టి పరిస్ధితుల్లోనూ సాయంత్రానికే : మూడు ముక్కలు చేశాక వాటిని క్రేన్లు, పంట్ల సాయంతో బ్యారేజీ నుంచి బయటకు తేవాలని నిర్ణయించారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ సాయంత్రానికి భారీ పడవలను తొలగించాలని భావిస్తున్నారు. పడవలను ముక్కలుగా చేసి బయటకు పంపే ప్రయత్నం నూటికి నూరు శాతం విజయవంతం అవుతుందని ఇంజినీర్లు, అధికారులు ధీమాతో ఉన్నారు. బ్యారేజీ నిర్మాణం, గేట్లు, కౌంటర్ వెయిట్లకు ఎక్కడా చిన్నపాటి నష్టం జరగకుండా అత్యంత సురక్షితంగా బోట్లను వెలికి తీస్తామని చెప్తున్నారు.

ఇటీవల పడవలు ఢీకొని 67, 68 గేట్ల వద్ద ఆగాయి. టన్నులకొద్దీ బరువులను అవలీలగా లేపే బాహుబలి క్రేన్లు భారీ కొక్కాలు హైడ్రాలిక్స్ బ్యారేజీని దాటుకుంటూ పడవ వద్ద దిగాయి. గేట్ల కింద నుంచి 2 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుండగా నడుముకు బెల్టులు ధరించిన సిబ్బంది క్రేన్ల సాయంతో పడవపై దిగారు. వంద టన్నుల బరువును తీయగలిగే ఉక్కుకడ్డీలతో అతి కష్టం మీద పడవకు ముందు, వెనుక భాగాల్లో కట్టారు. వాటిని క్రేన్ కొక్కాలకు తగిలించారు.

ఇక రెండు క్రేన్ల ఆపరేటర్లు ఒకేసారి పడవలను లిఫ్టు చేయడం ప్రారంభించారు. దీన్ని చూస్తున్న వారందరిలోనూ ఉత్కంఠ. భారీ క్రేన్లు కావడంతో ఇక పడవ పైకి లేవడం ఖాయమనుకున్నారు. కానీ ఇంజినీర్ల అంచనాలు తప్పాయి. పడవలు అంగుళం కూడా కదల్లేదు. ఒకేసారి 100 టన్నుల బరువును అవలీలగా ఎత్తగలిగే రెండు క్రేన్లూ పడవల్ని కదిలించలేకపోయాయి. 5 గంటల పాటు ప్రయత్నించినా నిరాశే ఎదురైంది. ఒక్క పడవనైనా తొలగిద్దామనుకున్నా అదీ సాధ్యపడలేదు. రెండు భారీ క్రేన్లకు అదనంగా ఓ మోస్తరు బరువు లేపే మరో క్రేన్​నూ తెప్పించారు. మరో తీగతో పడవలను లాగే ఏర్పాటు చేశారు.

ప్లాన్-ఏ నిష్పలం అంటూ ఆపరేషన్‌ క్లోజ్​ : 20 మంది సిబ్బంది బ్యారేజీ గేట్లపైకి దిగారు. అక్కడి నుంచి పడవ పైకెక్కి మరో కోణం వైపు మ్యాన్యువల్‌గా, లిఫ్టింగ్ యంత్రాలు పెట్టి పడవలను లాగడం ప్రారంభించారు. బ్యారేజీ పైనుంచి రెండు భారీ క్రేన్లు, పక్కనుంచి మరో క్రేను, కింద సిబ్బంది ఇలా నాలుగు వైపుల నుంచి లాగినా ప్రయోజనం లేదు. సాయంత్రం 6 గంటల వరకూ శ్రమించిన సిబ్బంది అలసట చెందారు. ప్లాన్-ఏ నిష్పలం అంటూ ఆపరేషన్‌ ఆపేశారు. ఒక్కో పడవ 40 టన్నుల బరువు ఉండడం, మూడు పడవలూ ఒకదానితో మరొకటి చిక్కుకుని ఉండడం వల్లే భారీ క్రేన్లు సైతం లేపలేకపోయాయని అధికారులు తెలిపారు.

ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొట్టిన ఘటన - ఇద్దరు నిందితుల అరెస్ట్ - PRAKASAM BARRAGE BOATS CASE

'ఆరోజు రాత్రి ఏం జరిగింది? ఆ పడవలు ఎవరివి?'- ప్రకాశం బ్యారేజీ కుట్రకోణంపై పోలీసుల దర్యాప్తు - Prakasam Barrage Boat Incident

Last Updated : Sep 11, 2024, 10:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.