MBBS Seats Allotment in AP 2024 : రాష్ట్రంలోని 35 వైద్య కళాశాలల్లో 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లను కేటాయించారు. ఇందుకు సంబంధించిన జాబితాను విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఆదివారం విడుదల చేసింది. అన్ని కళాశాలల్లో కలిపి మొత్తం 3879 సీట్లు ఉన్నాయి. వీటిలో 267 సీట్లు ప్రత్యేక కేటగిరీ కోటాకు సంబంధించినవి. ఆయా విభాగాల నుంచి ప్రాధాన్యత క్రమం వచ్చాక ఈ సీట్లను కేటాయిస్తారు.
MBBS Admissionsin AP Updates : ఇవి కాకుండా మిగిలిన 3612 సీట్లను మొదటి విడతలో భాగంగా కౌన్సిలింగ్లో ఉంచారు. వీటిలో 3507 సీట్లను భర్తీ చేస్తూ కళాశాలల వారీగా విద్యార్థులకు కేటాయిస్తూ జాబితాను విడుదల చేశారు. మిగిలిన 105 సీట్లలో 102 మైనార్టీ కేటగిరీ, 3 స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాకు సంబంధించినవి ఉన్నాయి. రెండో దశ కౌన్సిలింగ్లో భాగంగా ప్రత్యేక, మైనార్టీ, స్కౌట్స్ కేటగిరీకి సంబంధించిన సీట్లను భర్తీ చేయనున్నారు. మొదటి విడతలో సీట్లు పొందిన 3507మంది విద్యార్థులు ఈనెల 19 మధ్యాహ్నం 3గంటల్లోగా వారికి కేటాయించిన కళాశాలలకు వెళ్లి చేరాలని అధికారులు తెలిపారు. వారికి అక్టోబర్ 1 నుంచి ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
Costliest MBBS Colleges In India : దేశంలోనే అత్యంత ఖరీదైన MBBS డిగ్రీ.. ఆ కాలేజీలో ఫీజు రూ.కోట్లలో!