ETV Bharat / state

నాగార్జున పిటిషన్​పై మంత్రి కొండా సురేఖకు నోటీసులు

నాంపల్లి ప్రత్యేక కోర్టులో నాగార్జున పిటిషన్‌పై విచారణ - మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసిన నాంపల్లి ప్రత్యేక కోర్టు

Nagarjuna Defamation case
Nampally Special Court Notices Issued To Minister Konda Surekha (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 10, 2024, 2:45 PM IST

Updated : Oct 10, 2024, 3:15 PM IST

Nampally Court Send Notice To Minister Konda Surekha : హీరో నాగార్జున వేసిన పరువునష్టం కేసులో మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీచేసింది. తన కుటుంబంతో పాటు, కుమారుడు నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని నాగార్జున గత వారం నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.

రాజకీయ విమర్శల్లో భాగంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ నాగార్జున, నాగచైతన్య, సమంతల పేర్లను ప్రస్తావించారు. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలో నాగార్జున మంత్రిపై నాంపల్లి కోర్టులో క్రిమినల్‌ పరువునష్టం దావా వేశారు. ఆమె తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా నిరాధార వ్యాఖ్యలు చేశారని, ఆమెపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు.

కొండా సురేఖకు నోటీసులు : తనను సామాజిక మాధ్యమాల్లో బీఆర్ఎస్‌ పార్టీ వారు ట్రోల్‌ చేస్తున్నారంటూ మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమను కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా సమంత, నాగచైతన్య, నాగార్జున పేర్లను ప్రస్తావించడం, వారి వ్యక్తిగత విషయాలను మీడియా ముఖంగా మాట్లాడడంతో అవి కాస్త హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలో నాగార్జున మంత్రిపై నాంపల్లి కోర్టులో క్రిమినల్‌ పరువునష్టం దావా వేశారు.

అక్కినేని కుటుంబం, నటి సమంతపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగడంతో మంత్రి కొండా సురేఖ ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ.. సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదన్నారు. స్వయం శక్తితో ఆమె ఎదిగిన తీరు తనకు కేవలం అభిమానం మాత్రమే కాదు ఆదర్శం కూడా అని పేర్కొన్నారు. తన వ్యాఖ్యల పట్ల సమంత కానీ, ఆమె అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. అన్యధా భావించవద్దని కొండా సురేఖ పేర్కొన్నారు.

కొండా సురేఖపై నాగార్జున పరువునష్టం దావా - NAGARJUNA PETITION AGAINST SUREKHA

మళ్లీ మంత్రి కొండా సురేఖ కామెంట్స్ - ఈసారి ఏమన్నారంటే? - Minister Konda Surekha Comments

Last Updated : Oct 10, 2024, 3:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.