ETV Bharat / state

వారాహికి పోలీసుల అనుమతి నిరాకరణ - పవన్ కల్యాణ్​ పూజలు రేపటికి వాయిదా - No Permission to Pawan Varahi - NO PERMISSION TO PAWAN VARAHI

No Permission to Pawan Varahi Yatra: పవన్ కల్యాణ్​ పిఠాపురం పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. వారాహికి ముందస్తు అనుమతి తీసుకోని కారణంగా పోలీసులు యాత్రకు నిరాకరించారు. దీంతో ఆదివారం పురుహూతిక అమ్మవారి ఆలయంలో పవన్ పూజలు చేయనున్నారు.

No_Permission_to_Pawan_Varahi_Yatra
No_Permission_to_Pawan_Varahi_Yatra
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 30, 2024, 6:25 PM IST

Updated : Mar 30, 2024, 7:11 PM IST

No Permission to Pawan Varahi Yatra : జనసేన అధినేత పవన్ కల్యాణ్​ పిఠాపురం పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి. శక్తిపీఠం పురుహూతిక అమ్మవారి ఆలయంలో పవన్ పూజలు ఆదివారానికి వాయిదా పడ్డాయి. వారాహికి ముందస్తు అనుమతి తీసుకోని కారణంగా యాత్రకు పోలీసులు నిరాకరించారు. దీంతో ఆదివారం పురుహూతిక అమ్మవారి ఆలయంలో పవన్ పూజలు చేయనున్నారు. ప్రస్తుతం కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి చేబ్రోలు బహిరంగ సభకు పవన్ కల్యాణ్ బయలుదేరారు.

అయితే గతంలోనూ పవన్‌కల్యాణ్‌ వారాహి యాత్రపై ఆంక్షలు విధించిన సందర్భాలూ ఉన్నాయి. విశాఖలో జరిగిన వారాహి యాత్రకు అనేక షరతులు పెట్టారు. జాతీయ రహదారిపై వారాహి యాత్ర చేయకూడదంటూ షరతు పెట్టారు. అంతే కాకుండా తొలుత వారాహి సభకు అనుమతి ఇచ్చి, చివరి నిమిషంలో సభా స్థలిని మార్చుకోవాలంటూ ఇబ్బందులు పెట్టారు. ఇక ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా సరే పోలీసుల వైఖరిలో మార్పురాలేదు.

పవన్ కల్యాణ్​ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఫిక్స్ - పిఠాపురం నుంచే సమరశంఖం - Pawan Kalyan Election Campaign

Pawan Kalyan Pithapuram Schedule : పవన్ కల్యాణ్​ షెడ్యూల్​ ప్రకారం నేడు జనసేన శ్రేణులతో ప్రదర్శనగా పిఠాపురంలోని పాదగయ క్షేత్రానికి చేరుకుని పురుహూతిక అమ్మవారిని దర్శించుకోవాలి నిర్ణయించారు. అక్కడే వారాహి వాహనానికి సైతం పూజలు చేస్తామని అనుకున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని రామాలయం కూడలిలో బహిరంగ సభ ప్రాంగణానికి పవన్‌ కల్యాణ్‌ చేరుకుని, ‘వారాహి విజయభేరి’ మోగించి ఆ వాహనం పైనుంచే ప్రచార ప్రసంగం చేస్తారని ముందుగా తెలిపారు. అయితే తాజాగా పోలీసులు వారాహికి అనుమతి నిరాకరించడంతో వారాహికి పూజలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం పవన్ కల్యాణ్​ నేరుగా చేబ్రోలు బహిరంగ సభకు చేరుకున్నారు.

మరోవైపు పవన్‌ కల్యాణ్‌ నేటి నుంచి నాలుగు రోజులపాటు పిఠాపురంలోనే ఉండనున్నారు. నేడు బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం మిగిలిన మూడు రోజులు నియోజకవర్గం పరిస్థితిపైనే దృష్టిసారించనున్నారు. జన సైనికులకు దిశానిర్దేశం చేయడంతో పాటు, కూటమిలో భాగస్వాములైన జనసేన- టీడీపీ- బీజేపీ నేతలతో సమన్వయ సమావేశాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు.

కాగా పవన్‌ కల్యాణ్‌ తొలి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పవన్‌ పిఠాపురంలో పర్యటించనున్నారు. ఏప్రిల్‌ 3వ తేదీన తెనాలి, 4వ తేదీన నెల్లిమర్ల, 5వ తేదీన అనకాపల్లి, 6వ తేదీన ఎలమంచిలి, 7వ తేదీన పెందుర్తి, 8న కాకినాడ రూరల్, 9వ తేదీన పిఠాపురం, 10వ తేదీన రాజోలు, 11న పి.గన్నవరం, 12న రాజానగరం నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. అదే విధంగా ఉగాది వేడుకలను 9వ తేదీన పిఠాపురంలో జరుపుకోనున్నారు.

ఈసారి పీఠం కూటమిదే - పిఠాపురంలో స్పష్టం చేసిన పవన్​ - Pawan kalyan Pithapuram Tour

Last Updated : Mar 30, 2024, 7:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.