No Develop in Orvakal Rock Garden Kurnool : కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలోని రాతి వనాలు సహజ సౌందర్యంతో ఆకట్టుకుంటాయి. అగ్ని పర్వతాలు బద్దలవ్వడంతో ఏర్పడ్డ అతి సహజసిద్ధమైన ప్రకృతి అందాలే ఈ రాతి వనాలు. ఈ రాక్ గార్డెన్స్ ఆసియా ఖండంలోనే అతి పెద్దవిగా కోట్ల సంవత్సరాల క్రితమే ఏర్పడినట్లుగా చరిత్రకారులు చెబుతారు. కర్నూలు- చిత్తూరు జాతీయ రహదారిని ఆనుకుని ఉండే రాక్ గార్డెన్స్ కనువిందు చేస్తాయి.
Tourism Sector in AP : సుమారు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో రాక్ గార్డెన్స్ విస్తరించాయి. సహజసిద్ధంగా ఏర్పడిన రాళ్లు వివిధ ఆకృతులతో ఇట్టే కట్టిపడేస్తాయి. పచ్చని చెట్ల మధ్యలోంచి కాస్త లోపలికి వెళితే ఏ శిల్పి చెక్కాడా అనే అనుమానం కలుగక మానదు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ రాళ్ల మధ్యన నిలబడి సెల్ఫీలు తీసుకోకుండా వెళ్లరు. మరికొందరు ఫొటో షూట్ కోసం ఇక్కడికి వస్తుంటారు. ఎన్నో సీరియళ్లు, సినిమాలు ఇక్కడ షూటింగులు జరుపుకున్నాయి. కానీ నేడు ఒక సెల్వీ తీసుకునే పర్యటకడు కూడా కరవయ్యేంత దీన స్థితిలో గార్డెన్ ఉంది. ప్రస్తుతం దీని నిర్వహణ గాడి తప్పడంతో పర్యాటకులు కరవయ్యారు.
'ఇక్కడికి వచ్చే సందర్శకుల కోసం గత ప్రభుత్వాలు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక గదులు, విశాలమైన రహదారులు, పిల్లల కోసం క్రీడా పరికరాలు ఏర్పాటు చేసింది. కొండల మధ్య వెలసిన చెరువుపై వంతెన నిర్మించింది. పనికిరాని ఇనుప వస్తువులతో తయారు చేసిన జంతువులు, పక్షుల ప్రతిమలు ఏర్పాటు చేసింది. రాతివనాలు పర్యాటకుల తాకిడితో నిత్యం కళకళలాడుతూ ఉండేవి. గత తెలుగుదేశం ప్రభుత్వం 3 కోట్లతో రాక్ గార్డెన్స్‌ను ఎంతగానో అభివృద్ధి చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల హయాంలో కనీసం ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. అభివృద్ధి మాట అటుంచితే నిర్వహణ కూడా పట్టించుకోలేదు. గదులు ఖాళీగా ఉంటున్నాయి. ఆదాయం భారీగా పడిపోయింది. విద్యుత్ దీపాలు పనిచేయటం లేదు. గార్డెన్ రూపు కోల్పోయింది. సాహస క్రీడలు అటకెక్కాయి. గతంలో పున్నమి ఫెస్టివల్ లాంటివి నిర్వహిస్తే గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా అలాంటి ఉత్సవాలు నిర్వహించలేదు.' -పర్యాటకులు
Tourism Not Developed in YSRCP Government : ప్రస్తుతం పర్యాటకులు చాలా తక్కువగా వస్తున్నారు. త్వరలో ఏర్పాటు కాబోయే కొత్త ప్రభుత్వం రాతి వనాలను అభివృద్ధి చేయాలని సందర్శకులు కోరుతున్నారు.
జగన్ హయాంలో పర్యాటక రంగం కుదేలు- పెట్టుబడులకు ప్రైవేటు సంస్థల వెనకంజ - YSRCP Not developing tourism