ETV Bharat / state

బెంగళూరుతో పోలికొద్దు - హైదరాబాద్​లో ఆ దుస్థితి రాదు : దానకిశోర్ - Water Crisis in Hyderabad - WATER CRISIS IN HYDERABAD

No Bengaluru Like Water Crisis in Hyderabad : నీటి సరఫరా విషయంలో హైదరాబాద్ నగరాన్ని బెంగళూరుతో పోల్చవద్దని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ విజ్ఞప్తి చేశారు. ఏ నగరానికి ఉండే బాధ ఆ నగరానికి ఉంటుందన్న ఆయన హైదరాబాద్ లో బెంగళూరు లాంటి పరిస్థితి లేదని స్పష్టం చేశారు. మార్చిలోనే భూగర్బజలాలు అడుగంటి బోరుబావులు ఎండిపోవడం వల్ల కొన్నిచోట్ల నీటి ట్యాంకర్లకు డిమాండ్ పెరిగిందన్న దాన కిషోర్ తాగునీటి కోసం నగర ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Water problems in Hyderabad
Municipal Secretary Review On Hyderabad Water supply
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 9, 2024, 1:55 PM IST

బెంగళూరు లాంటి పరిస్థితి హైదరాబాద్‌లో రాదు : దాన కిషోర్‌, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి

No Bengaluru Like Water Crisis in Hyderabad : హైదరాబాద్ మహానగర ప్రజల తాగునీటి అవసరం కోసం రిజర్వాయర్లలో ఏడాదికి సరిపడా నీటి నిల్వలున్నాయని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ తెలిపారు. నగరంలో నీటి సరఫరా, ట్యాంకర్ల డిమాండ్‌పై ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఎండీ సుదర్శన్ రెడ్డి సమక్షంలో సీజీఎంలు, జీఎంలతో సమీక్ష నిర్వహించిన దాన కిషోర్ ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

డివిజన్ల వారీగా నీటి సరఫరా, ట్యాంకర్ల డిమాండ్‌పై వివరాలు ఆరా తీసిన దాన కిషోర్ జల మండలి సర్వే చేసిన 1700 ఇళ్లల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడం వల్లే ఆయా ప్రాంతాల్లో నీటి కొరత తలెత్తిందని స్పష్టం చేశారు. మార్చిలోనే భూగర్భ జలాలు నిండుకోవడం వల్ల ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడం ఆలస్యమవుతుందని వివరించారు. 12 గంటల్లో నీళ్లు అందించేందుకు వెయ్యి ట్యాంకర్లను పెంచుతున్నామని, రవాణా శాఖ సహకారంతో కొత్త ట్యాంకర్ షెల్స్​ను కూడా తయారు చేయిస్తున్నట్లు దాన కిషోర్ వెల్లడించారు.

ఈ వేసవికి ఢోకా లేదు - భాగ్యనగరవాసులకు ప్రభుత్వం భరోసా - hyderabad Water board

No Water Problems in Hyderabad : అయితే బెంగళూరు లాంటి పరిస్థితి హైదరాబాద్ లో లేదని స్పష్టం చేశారు. జలమండలి సరఫరా చేసే నీటిలో 96 శాతం తాగునీటి అవసరాలకే వెళ్తోందని, మిగిలిన 4 శాతం మాత్రమే వాణిజ్య అవసరాలకు సరఫరా అవుతుందని దాన కిషోర్ వివరించారు. ప్రజల తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నామన్న దాన కిషోర్ నాగార్జున సాగర్‌లో అవసరమైతే ప్రత్యేక బార్జ్ ఏర్పాటు చేసి ఏడాదంతా నీటి సరఫరా చేస్తామన్నారు.

ఇంకుడు గుంతల నిర్మాణం : అలాగే నగరంలో భూగర్భ జల మట్టాల్ని పెంచేందుకు ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని దాన కిషోర్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ట్యాంకర్ ద్వారా వాటర్ బుక్ చేసుకుంటున్న వినియోగదారులకు నీరు సరఫరా చేస్తూనే ఇళ్లల్లో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టేలా అవగాహన కల్పించాలన్నారు. వేసవిలో నీటి సమస్యను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం రూ. 50 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని, ఆ నిధులతో నగరంలో నీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపడుతున్నట్లు దాన కిషోర్ వివరించారు.

"హైదరాబాద్​లో సమృద్దిగా నీళ్లు ఉన్నాయి. ఆరు నెలల వరకు ఎలాంటి నీటి కొరత ఉండదు. హైదరాబాద్​లో కొంత మంది మాత్రమే ట్యాంకర్లు అడుగుతున్నారు. ఎల్లంపల్లి రిజర్వాయర్​లో 5 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఈ వేసవి మొత్తానికి ఇందులోంచి 3.33 టీఎంసీలు సరిపోతాయి." -దాన కిషోర్, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి

ముఖ్యనగరాల్లో నీటి కొరత - చర్యలు చేపట్టకపోతే అంతే సంగతి - Water Crisis in India

హైదరాబాద్​లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలి : మంత్రి పొన్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.