ETV Bharat / state

సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్‌ సీఈఓ భేటీ - స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్​పై చర్చ

సీఎం చంద్రబాబుతో నీతిఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం సమావేశం - స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047కు సంబంధించిన అంశాలపై చర్చ

Niti Aayog CEO BVR Subramanyam Meets CM Chandrababu Naidu
Niti Aayog CEO BVR Subramanyam Meets CM Chandrababu Naidu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Niti Aayog CEO BVR Subramanyam Meets CM Chandrababu Naidu : స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ - 2047 (Swarnandhra Vision Document 2047)కు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం సమావేశం అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ భేటీలో నీతి ఆయోగ్​కు సంబంధించిన సలహాదారు, డైరెక్టర్లతో పాటు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.

వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించేలా కార్యాచరణ : కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ చోటు చేసుకుంది. ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు సాధన లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047 ప్రణాళిక రూపొందించినట్టు సీఎం చంద్రబాబు వివరించారు. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఏపీ అభివృద్ధి లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్​ను రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో రూపొందించినట్టు సీఎం స్పష్టం చేశారు.

వికసిత్ ఆంధ్రప్రదేశ్-2047కు విజన్ డాక్యుమెంట్ - నీతిఆయోగ్‌తో చంద్రబాబు సమావేశం - Niti Aayog CEO Meets CM Chandrababu

వ్యవసాయం, ఆక్వా తదితర రంగాల్లో అభివృద్ధి సాధించేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్టు సీఎం నీతి ఆయోగ్ సీఈఓకి వివరించారు. ప్రభుత్వ ప్రాధాన్యాలైన పేదరిక నిర్మూలన, ఈజ్ ఆఫ్ లివింగ్, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధి, డెమోగ్రాఫిక్ మేనేజిమెంట్, డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి గ్రోత్ ఇంజన్లతో వృద్ధి రేటు సాధించేలా ఈ ప్రణాళికలు రూపొందాయని వీటిని సమర్ధంగా అమలు చేసేలా కార్యాచరణ చేసినట్టు సీఎం ఈ సమావేశంలో స్పష్టం చేశారు.

2047 వికసిత్ భారత్ కోసం పెద్ద ప్రణాళికలు- ఎవరూ భయపడాల్సిన అవసరంలేదు : మోదీ - Modi Interview Lok Sabha Polls

వికసిత్ భారత్, ఆత్మనిర్భర్‌ భారత్‌కు ప్రజలు ఓటు వేశారు: పురందేశ్వరి - BJP State Executive Meeting

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.