Night Polytechnic College for Working People in AP : ఉద్యోగం చేస్తూనే ఇంజినీరింగ్ చదివేందుకు ఇప్పటికే అవకాశం కల్పించగా ఇప్పుడు తాజాగా డిప్లొమా కోర్సులు చదువుకునేందుకు సాంకేతిక విద్యాశాఖ అనుమతులు ఇచ్చింది. ఈ పద్ధతిలో పగలు ఉద్యోగం చేసి, రాత్రి పూట డిప్లొమా కోర్సుల్లో చేరవచ్చు. మామూలు రోజుల్లో రాత్రి 6 గంటల - 9 గంటల వరకు, ఆదివారం పూర్తిగా తరగతులు నిర్వహిస్తారు. చాలా మందికి డిప్లొమా చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా వివిధ కారణాలతో చదువుకోలేకపోయిన వారు. పది, ఐటీఐలతో చదువు ఆపేసి, ఉద్యోగం చేస్తున్న వారికి ఈ కాలేజీలు ఎంతోగానో ఉపయోగపడతాయి.
డిప్లొమా, ఆ తర్వాత ఇంజినీరింగ్ చదివితే ఉన్నత హోదాకు వెళ్లేందుకు మంచి అవకాశం ఏర్పడుతుంది. పని అనుభవానికి విద్యార్హతలు తోడవ్వడంతో ఆయా కంపెనీల్లో ఎదిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6 కాలేజీల్లో 9 బ్రాంచిలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కోర్సులో 30 సీట్లు చొప్పున 390 ఉండగా వీటికి అదనంగా ఈడబ్ల్యూఎస్ (EWS) కోటాల్లో 3 సీట్లు కేటాయించాగా మొత్తంగా 429 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మామూలుగా డిప్లొమా 3 సంవత్సరాలు కాగా, ఈ విధానంలో రెండేళ్లు, రెండున్నరేళ్ల కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నెల 26వ తేదీ (అక్టోబర్ 26న) సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
అర్హతలు ఇలా : ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమల్లో పని చేస్తున్న వారు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పని ప్రాంతం లేదా నివాసం ఈ విద్యా సంస్థలకు 50 కిలోమీటర్లు లోపు ఉండాలి. కనీసం ఏడాది పూర్తి సమయం/ రెగ్యులర్ పని చేసినట్లు అనుభవం కలిగి ఉండాలి. అభ్యుర్థులు అప్లికేషన్ చేసుకున్న పాలిటెక్నిక్ కాలేజీ వద్దనే కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అభ్యుర్థుల నుంచి వచ్చిన దరఖాస్తుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. కౌన్సెలింగ్ అప్పుడు అభ్యర్థులు అర్హత సర్టిఫికేట్లు, చెల్లించాల్సిన ఫీజుతో ఈ నెల 28న ఉదయం 10 గంటలకు ఆయా పాలిటెక్నిక్లకు నేరుగా హాజరు కావాలి.
డిప్లొమా అర్హతతో - రైల్వేలో 7951 జేఈ పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా! - RRB JE Recruitment 2024
కోర్సులు వివరాలు : మెకానికల్, ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్, కంప్యూటర్, ఎలక్ట్రికల్-ఎలక్ట్రానిక్స్, సివిల్ ఇంజినీరింగ్ కోర్సులు రెండేళ్లు అందుబాటులో ఉంటాయి. కెమికల్(Oil Technology), కెమికల్(Petrochemical), కెమికల్ ఇంజినీరింగ్ కోర్సులు రెండున్నరేళ్ల ఉంటాయి.
ఏ కళాశాలలో ఏ కోర్సులు :
కళాశాల | కోర్సులు |
విశాఖపట్నం ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ | కెమికల్ ఇంజినీరింగ్ |
శ్రీ వేంకటేశ్వర ఇంజినీరింగ్ టెక్నాలజీ కళాశాల, చిత్తూరు | ఈసీఈ |
గోదావరి ఇంజినీరింగ్ టెక్నాలజీ కళాశాల, రాజమహేంద్రవరం | మెకానికల్, కంప్యూటర్స్ ఇంజినీరింగ్ |
వేమూ టెక్నాలజీ కళాశాల, చిత్తూరు | ఈసీఈ, ఈఈఈ |
బేహర శుభాకర్ పాలిటెక్నిక్, విశాఖపట్నం | ఈసీఈ, ఈఈఈ, ఎంఈ కోర్సులు |
ప్రశాంతి పాలిటెక్నిక్, అచ్యుతాపురం | సీఈ, ఎంఈ కోర్సులు |