NIA Raids in Hyderabad Today : హైదరాబాద్‌లోని పలుచోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో హిమాయత్‌నగర్‌లో విరసం నేత వరవరరావు అల్లుడు, వీక్షణం పత్రిక సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ నివాసంలో ఈరోజు తెల్లవారుజామన 4 గంటల నుంచే ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది. సుమారు 5 గంటలపాటు ఆయన ఇంట్లో దాడులు కొనసాగాయి.
దేశంలో బాంబు పేలుళ్లకు ఐసిస్ కుట్ర- భగ్నం చేసిన ఎన్ఐఏ- 8 మంది ఉగ్ర ఏజెంట్లు అరెస్టు
NIA Raids Various Locations In Hyderabad : ఇటీవల మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు సందీప్ దీపక్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. దీపక్ దగ్గర దొరికిన సమాచారం మేరకు వేణుగోపాల్ నివాసంలో సోదాలు చేపట్టిన ఎన్‌ఐఏ అధికారులు, ఆయన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ తనిఖీలపై వేణుగోపాల్ స్పందించారు. ఎన్‌ఐఏ బృందం తన నివాసానికి సెర్చ్ వారెంట్‌తో వచ్చిందని ఆయన చెప్పారు.
NIA Searches Veekshanam Paper Editor Venugopal : సెప్టెంబరు 15న మలేషియా టౌన్‌షిప్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీకి చెందిన సంజయ్ దీపక్‌రావును పోలీసులు అరెస్టు చేశారని వేణుగోపాల్ తెలిపారు. ఆ కేసులో తనకు కూడా సంబంధం ఉందని ఏ-22గా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. దీని ఆధారంగా ఎన్‌ఐఏ కూడా కేసు నమోదు చేసిందని, ఇదే వ్యవహారంలో దాడులు చేశారని వివరించారు. తన సెల్‌ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారని అన్నారు. ప్రస్తుతం తాను విరసం (విప్లవ రచయితల సంఘం)లో లేనని, అయినా ఎన్‌ఐఏ (NIA) అక్రమంగా తనపై కేసులు పెట్టిందని వేణుగోపాల్ ఆరోపించారు.
"ఎన్‌ఐఏ బృందం మా ఇంటికి సెర్చ్ వారెంట్‌తో వచ్చింది. మావోయిస్టు కేంద్ర కమిటీకి చెందిన సంజయ్ దీపక్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. అందుకు సంబంధించిన సమాచారం కోసం అధికారులు మా ఇంటికి వచ్చారు. ఆ కేసులో నాకు కూడా సంబంధం ఉందని ఏ-22గా పోలీసులు నాపై కేసు పెట్టారు. దీని ఆధారంగా ఎన్‌ఐఏ కూడా కేసు నమోదు చేసింది. ఇదే వ్యవహారంలో దాడులు చేశారు. నా సెల్‌ఫోన్‌ను అధికారులు తీసుకున్నారు. ఎన్ఐఏ అధికారులు ఎవ్వరూ నన్ను ఇబ్బంది పెట్టలేదు." - వేణుగోపాల్, వీక్షణం పత్రిక సంపాదకుడు
అటు ఎల్బీనగర్‌లోని (NIA Searches in LB Nagar) రవిశర్మ, అనురాధ దంపతుల ఇంట్లోనూ తెల్లవారుజామున 5 గంటల నుంచే జాతీయ దర్యాప్తు సంస్థ తనిఖీలు నిర్వహించింది. సుమారు 5 గంటలపాటు ఆయన ఇంట్లో సోగాలు నిర్వహించిన అధికారులు రవిశర్మ సెల్‌ఫోన్‌తో పాటు బుక్‌లెట్, కరపత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్ఐఏ దాడులపై రవిశర్మ స్పందించారు. గతంలో 2019లో, 2021లోనూ, ఇప్పుడు తాజాగా ఎన్ఐఏ సోదాలు నిర్వహించారని తెలిపారు. తాను 2016 నుంచి మావోయిస్టు కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నానని వివరించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. 26 మందిపై కేసు.. నలుగురు అదుపులోకి..
మానవ అక్రమ రవాణా కేసులో ముగ్గురు మయన్మార్ దేశస్థులపై ఎన్ఐఏ ఛార్జిషీట్