NEET Question Paper Mix Up in Telangana : వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష నీట్ ప్రశ్నాపత్నం ఓ పరీక్షా కేంద్రంలోని విద్యార్థులకు మారిపోయింది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్షలో క్వశ్చన్ పేపర్ తారుమారైంది. దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఎన్టీఏ అందించిన పేపర్ కాకుండా ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో పరీక్షకు హాజరైన విద్యార్థులకు మరో ప్రశ్నపత్రం అందించడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్ ఏంటని అయోమయంలో పడిన విద్యార్థుల తల్లిదండ్రులు ఈ వ్యవహారంపై ఆసిఫాబాద్ కలెక్టర్‌ను ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
NEET PG Medical Exam 2024-25 : ఆసిఫాబాద్ మోడల్ స్కూల్ కేంద్రంలో 323 మందికి గానూ 299 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ప్రశ్నాపత్రం మార్పుపై పరీక్ష నిర్వాహకులను వివరణ కోరగా ఎస్బీఐ బ్యాంకు నుంచి తీసుకురావలసిన పేపర్‌కు బదులు కెనరా బ్యాంకు నుంచి తెచ్చిన పేపర్‌ను విద్యార్థులకు అందించినట్లు తెలిపారు. అయితేతే, ఎన్టీఏ ఈ- మెయిల్ ఆధారంగానే పరీక్ష పత్రం తీసుకువచ్చినట్లు అధికారులు వివరించారు.
NEET Exam 2024 Result Date : దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను పెన్ను, పేపర్ విధానంలో ఆదివారం (మే 5వ తేదీ) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు డ్రెస్‌కోడ్ తప్పనిసరిగా పాటించాలనే నిబంధన పెట్టడంతో విద్యార్థులంతా ఆ నిబంధనల ప్రకారమే పరీక్షకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా సుమారు 23 లక్షల విద్యార్థులుపైగా పరీక్ష రాశారు. తెలంగాణలో 80 వేల మంది హాజరయ్యారు. ఈసారి నిర్వహించిన ప్రశ్నపత్రం చాలా కఠినంగా ఉందని, ముఖ్యంగా ఫిజిక్స్‌లో ప్రశ్నలు కష్టంగా ఇచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు.
NEET Exam 2024 Expected Cut Off : నీట్ పరీక్షలో మొత్తం 720 మార్కులకు 700 దాటడం కష్టమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో కన్వీనర్ కోటాలో సీటు దక్కాలంటే కనీసం 440 మార్కులు వస్తే సరిపోతుందని చెబుతున్నారు. ఈ పరీక్ష ఫలితాలు జూన్ 14న వెల్లడిస్తామని జాతీయ పరీక్ష సంస్థ ప్రకటించింది. ఈ నెలాఖరులోగా నీట్ ‘కీ’ విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపింది.