ETV Bharat / state

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ - ఉత్తర్వులు జారీ - AP NEW CS Neerabh Kumar - AP NEW CS NEERABH KUMAR

AP New CS Neerabh Kumar was Appointed: ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్‌ అధికారి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటి వరకూ సీఎస్‌గా ఉన్న కె.ఎస్‌.జవహర్‌రెడ్డి సెలవుపై వెళ్లారు. ఆయన జూన్‌ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు.

Neerabh Kumar Prasad likely Appointed To New CS in AP
Neerabh Kumar Prasad likely Appointed To New CS in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 7, 2024, 8:20 AM IST

Updated : Jun 7, 2024, 10:56 AM IST

Neerabh Kumar Prasad Likely Appointed To New CS in AP: ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఏపీ కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటి వరకూ సీఎస్‌గా ఉన్న కె.ఎస్‌.జవహర్‌రెడ్డి గురువారం సెలవుపై వెళ్లారు. ఆయన జూన్‌ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. నీరభ్‌ కుమార్‌ బుధవారం ఉండవల్లి నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు. 1987 బ్యాచ్‌కు చెందిన నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇ

అప్పుడు అలా, ఇప్పుడు క్యూ కట్టారు - ఆ ముగ్గురు ఐపీఎస్​లకు నో ఎంట్రీ! - IPS OFFICERS NOT ALLOWED TO Meet CBN

మరోవైపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో సీఎంఓ ఏర్పాటుపై కసరత్తు మొదలైంది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర సీఎంఓ బాధ్యతలు చూడనున్నారు. ఆయనను ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. రెండు రోజుల్లో మరో ఇద్దరు, ముగ్గురు అధికారులనూ నియమించే అవకాశం ఉంది.

పూలు, స్వీట్లతో తాడేపల్లిలో జగన్ నివాసానికి రాజధాని రైతులు!

ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చంద్రబాబుని సీఎస్ జవహర్ రెడ్డి ఆయన నివాసంలో కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసి జవహర్ రెడ్డి ఆయనకు అభినందనలు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు ప్రభుత్వ ఉన్నతాధికారులు, గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎస్ జవహర్ రెడ్డి, మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ చంద్రబాబు నివాసానికి వచ్చారు. పర్యావరణ, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ చంద్రబాబుని కలిసేందుకు ఉండవల్లిలోని ఆయన ఇంటికి వచ్చారు. దీంతో ప్రస్తుతం నీరభ్‌కుమార్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది.

ప్రస్తుతం సెలవులపై వెళ్లిన జవహర్​ రెడ్డిపై వైఎస్సార్సీపీకి అనుకూలంగా పని చేశారనే అనేక ఆరోపణలు ఉన్నాయి. సీఎస్ జవహర్ రెడ్డి రాజధాని పేరుతో విశాఖ, భోగాపురం సమీపంలోని రైతుల భూములను అక్రమంగా వైఎస్సార్సీపీ నేతలకు కట్టబెట్టే పనికి పూనుకున్నారని జనసేన నేత ఆరోపించారు. రైతులను బెదిరించి, వారి భూములను రాయించుకొని ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ తెచ్చుకునట్టు పేర్కొన్నారు.

సెలవుపై జవహర్‌రెడ్డి- సాయంత్రం కొత్త సీఎస్‌ను నియమించే అవకాశం! - CS Jawahar Reddy

Last Updated : Jun 7, 2024, 10:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.